SPORTS : ఉత్సాహంగా మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలు
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:22 AM
రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్థానిక నీలం సంజీవరెడ్డి పీటీసీ స్టేడియంలో శనివారం రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కొండయ్య, రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన (మా) అధ్యక్షుడు లక్ష్మీపతిరాజు, కార్యదర్శి రాంప్ర సాద్ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతపురం క్లాక్‌టవర్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్థానిక నీలం సంజీవరెడ్డి పీటీసీ స్టేడియంలో శనివారం రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కొండయ్య, రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన (మా) అధ్యక్షుడు లక్ష్మీపతిరాజు, కార్యదర్శి రాంప్ర సాద్ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. 30ఏళ్ల నుంచి ఆపై వయస్సున్న మహిళలు, పురుషులు వేర్వేరుగా పరుగు, స్పీడ్‌వాక్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 300, 400మీటర్ల వాక్, 3కె రన, 5కె రన, జావెలిన త్రో, షార్ట్‌పుట్, డిస్కస్‌త్రో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ సాధన కోసం నగరంలోని సప్తగిరి సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీనాక్షమ్మ ఫౌండేషన వ్యవ స్థాపకులు రవికాంత రమణ, ఎస్కేయూ మాజీ రిజిసా్ట్రర్ సుధాకర్‌బాబు, మా కార్యనిర్వాహక కార్యదర్శి ఇంజనీరు సుధాకర్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సికిందర్, కార్యదర్శి లోకనాథ్, సభ్యులు రొళ్ళ భాస్కర్, సుంకర రమేష్, నాగశివ, సతీష్, నందిత తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....