Share News

MLA : ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Feb 09 , 2025 | 12:27 AM

మండలపరిధిలోని గొందిరెడ్డిపల్లి వద్ద ఉన్న ఏపీఐఐసీ ఎంఎస్‌ఎంఈ ఇండస్ర్టియల్‌ ఎస్టే ట్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా మని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో ఉన్న ఎలైట్‌ బయో టెక్నాలజీస్‌ ల్యాబ్‌లో అరటి మొక్కల తయా రీని ఆమె శనివారం ఏపీఐఐసీ అధికారుల తో కలిసి సందర్శించారు. అరటి మొక్కలు తయారీ విధానం, అవి రైతులకు ఏ విదంగా ఉపయోగపడుతుందన్న అంశా ల గురించి తెలుసుకున్నారు.

MLA : ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో సమస్యలు పరిష్కరిస్తాం
MLA Paritala Sunitha talking to industrialists

రాప్తాడు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని గొందిరెడ్డిపల్లి వద్ద ఉన్న ఏపీఐఐసీ ఎంఎస్‌ఎంఈ ఇండస్ర్టియల్‌ ఎస్టే ట్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా మని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో ఉన్న ఎలైట్‌ బయో టెక్నాలజీస్‌ ల్యాబ్‌లో అరటి మొక్కల తయా రీని ఆమె శనివారం ఏపీఐఐసీ అధికారుల తో కలిసి సందర్శించారు. అరటి మొక్కలు తయారీ విధానం, అవి రైతులకు ఏ విదంగా ఉపయోగపడుతుందన్న అంశా ల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో ఉన్న పారిశ్రామిక వేత్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌ 50 ఎకరాల్లో ఉండగా...అందులో 26 ఎకరాలు వినియోగంలో ఉందని వారు తెలిపారు. 319 ఫ్లాట్లు వేశారని, 239 ఫ్లాట్లు వినియోగిస్తున్నామన్నారు. పరిశ్రమలు నడిపేందుకు ప్రధానంగా నీరు, విద్యుత సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఐలా అమోదం ఏడాది నుంచి పెండింగ్‌లో ఉందని పంచాయితీరాజ్‌ విభాగంలో ఈ ఫైల్‌ ఉందని తెలిపారు.రామినేపల్లి నుంచి ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌ వరకూ 80 అడుగుల తారురోడ్డు నిర్మించాల న్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలి పారు. ఇక్కడ మరో ఇండస్ర్టియల్‌ పార్క్‌ వచ్చేలా చూస్తామన్నారు. ఇండ స్ర్టియల్‌లో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. కార్యక్రమంలో రాప్తాడు, ఆత్మకూరు మండలాల ఇనచార్జ్‌లు ధర్మవరపు మురళి, బాలాజి, కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఎంపీటీసీ జాఫర్‌, సర్పంచులు శీనయ్య తిరుపాలు, వాటర్‌షెడ్‌ చైర్మన మల్లి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 09 , 2025 | 12:27 AM