MLA : పారదర్శకంగా సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:20 AM
పారదర్శకత పాటిస్తూ ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అధికారులకు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీతో పాటు, అనంతపురం ఆర్డీఓ కేశవులునాయుడు, మండలంలోని వివిధ శాఖల అధికారులు హజరయ్యారు.
అధికారులకు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ఆదేశం
బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పారదర్శకత పాటిస్తూ ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అధికారులకు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీతో పాటు, అనంతపురం ఆర్డీఓ కేశవులునాయుడు, మండలంలోని వివిధ శాఖల అధికారులు హజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వివరించారు. ప్ర ధానంగా భూ సమస్యలు, భూ రీసర్వే సమస్యపై ఫిర్యాదులు ఎక్కువగా వ చ్చాయి. వీటితో పాటు దండువారిపల్లి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దండువారిపల్లి చెరువుకు నీరు విడుదల చేయించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి తదితరులు ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇచ్చారు. బుక్కరాయసముద్రం పంచాయతీలోని పది కాలనీల్లో మౌలిక సదుపాయా లు కల్పించాలని, ఇంటి పట్టాల సమస్యను పరిష్కరించాలని కోరారు. సర్వే నంబరు 539-2, 540-2లో ఉన్న 71 సెంట్ల స్థలాన్ని వెంటనే అంబేడ్కర్ స్మారక భవనానికి కేటాంచాలని సీపీఎం జిల్లా అధ్యక్షుడు ఓ నల్లప్ప తదిత రులు ఎమ్మెల్యేని కోరారు. మొత్తంగా ఈ ప్రజావేదికలో మండలంలోని 417 మంది వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే శ్రావణీశ్రీ తెలిపారు.
ప్రజల వద్దకే... కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకే వచ్చి పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. ప్రజావేదిక ద్వారా ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలన్నిటినీ సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందుస్తు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ తేజోత్స్న, ఎంపీపీ సునీత, కన్వీనర్ అశోక్, టీడీపీ జిల్లా నాయకులు పసుపుల శ్రీరామిరెడ్డి, కేశన్న, రవీంద్ర, లక్ష్మీ నారాయణ, ఎస్ నారాయణస్వామి, ఓబులపతి, జొన్నారామయ్య, పెద్దప్ప, సోమశేఖర్, ఆదేప్ప, రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....