Share News

AUCTION : సిండికేట్‌గా వేలం ముగింపు

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:22 AM

వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. నగరపాలక సంస్థలో సంత, దినసరి మార్కెట్‌ రుసుము వసూలుచేసుకునే హక్కుకు సంబంధించి 2025-26 సంవత్సరానికి నిర్వహించిన వేలం అందుకు నిద ర్శనంగా నిలిచింది. వాస్తవానికి ఈ నెల 4న వేలం నిర్వహిం చారు.

AUCTION : సిండికేట్‌గా వేలం ముగింపు
Commissioner Balaswamy conducting the auction

కూరగాయల మార్కెట్‌ వేలం రూ. 8.15 లక్షలకు

అనంతపురం క్రైం,ఫిబ్రవరి11(ఆంధ్రజ్యోతి) : వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. నగరపాలక సంస్థలో సంత, దినసరి మార్కెట్‌ రుసుము వసూలుచేసుకునే హక్కుకు సంబంధించి 2025-26 సంవత్సరానికి నిర్వహించిన వేలం అందుకు నిద ర్శనంగా నిలిచింది. వాస్తవానికి ఈ నెల 4న వేలం నిర్వహిం చారు. నగరానికి చెందిన విజయ్‌కుమార్‌, పామిడికి చెందిన అభిలాష్‌, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వెంకట రాజేం ద్రప్రసాద్‌ హాజరయ్యారు. ఆ సందర్భంలో రూ.88లక్షలతో వేలం ప్రారంభించగా...తమకు గిట్టుబాటు కావడం లేదని, ఆ మొత్తాన్ని తగ్గించాలని కోరారు. దీనిపై కమిషనర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని వివరిస్తూ డిప్యూటీ కమిషనర్‌ వెం కటేశ్వర్లు వాయిదా వేశారు. మంగళవారం కమిషనర్‌ బాల స్వామి ఆర్వో విజయ్‌కుమార్‌తో కలిసి బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ సారి విజయ్‌కుమార్‌, అభిలాష్‌ మాత్రమే వేలంలో పాల్గొన్నారు. సిండికేట్‌ వ్యవహారం నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్‌ హాజరు కాలేదని తెలుస్తోంది. గత ఏడాది మార్కెట్‌ వేలం 87.90లక్షలకు దక్కించుకున్నారని చెబుతూ కమిషనర్‌ ఈ సారి సర్కారు వారి పాట రూ.88లక్షలతో ప్రా రంభిస్తామన్నారు. మరోసారి వేలందారులు అభ్యంతరం వ్య క్తం చేశారు. అందుకు నిరాకరిస్తూ కమిషనర్‌ వేలం ప్రారం భించారు. అభిలాష్‌ రూ.88.15లక్షలకు పాడాడు. ఇక ముం దుకు సాగలేదు. అభిలాష్‌ ఆ మొత్తానికి వేలం దక్కించు కున్నాడు. కాగా వేలంలో వారిద్దరికి అదనంగా మరో ఇద్దరు సహాయకారులమంటూ వేలంలో పాల్గొనడం గమనార్హం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 12 , 2025 | 12:22 AM