శనివారం ఉదయం సౌర్లాండ్ మౌంటెన్ హైకింగ్ ట్రయిల్ హిల్స్ బరోలో తానా న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో హైకింగ్ ఈవెంట్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో తెలుగు, తమిళ, కన్నడ ఇతర రాష్ట్రాల భక్తులు పాల్గొని, స్వామి-అమ్మవారి కళ్యాణం తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. భక్తులకు టీటీడీ లడ్డు ప్రసాదం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం కళ్యాణ ప్రసాద భోజనమును అందించారు.
న్యూయార్క్లో ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని ఆసరాగా చేసుకుని రెండో జాబ్ చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అతడిపై మోపిన అభియోగాలు రుజువైతే గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్లో నిర్వహించిన చెంచు లక్ష్మి నృత్య నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
బ్రూనై తెలుగు సంఘం దీపావళి పండుగను పురస్కరించుకుని పలు సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించింది. సామాజిక సేవ కార్యక్రమాలు ఈ పండుగను మరింత అర్థవంతంగా మార్చాయని సంఘం అధ్యక్షుడు పేర్కొన్నారు.
కెనడాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఆగస్టులో కెనడాకు వెళ్లిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 60 శాతం మేర పడిపోయింది.
మూడు రోజుల యూఏఈ పర్యటన నిమిత్తం బుధవారం నాడు దూబాయ్కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. స్థానిక కాన్సుల్ జనరల్తోపాటు టీడీపీ నేతలు, ఎన్నారై ప్రముఖులు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న పెన్సిల్వేనియాలోని గ్లెన్మూర్లోని గ్రిఫిత్ హాల్లో దీపావళి లేడీస్ నైట్ 2025 కార్యక్రమం జరిగింది. సెలబ్రిటీలు లేకుండా మహిళలే ముఖ్య అతిథులుగా, మహిళలే స్వయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 300మందికిపైగా హాజరై ఉల్లాసంగా, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) ఆధ్వర్యంలో వార్సా నగరంలో అక్టోబర్ 18న ఈ దివ్య మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు, స్థానిక ఎన్నారైలు హాజరయ్యారు.
టెక్సాస్ గవర్నర్ నివాసంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు భారీగా ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని.. అందులో ప్రవాసుల పాత్ర కీలకమని తెలిపారు.