Share News

Christmas Celebrations: ఖతర్‌లోని క్రీస్తు సైనికుల సహవాసం చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 07:19 PM

తెలుగు ప్రవాసీయుల చర్చి అయిన క్రీస్తు సైనికుల సహవాసం ఆధ్వర్యంలో కరుణామయుడు, శిలువ యాగం చేసిన ప్రేమ స్వరూపుడు ఏసు క్రిస్తు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Christmas Celebrations: ఖతర్‌లోని క్రీస్తు సైనికుల సహవాసం చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు
Qatar Christmas celebrations

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రపంచ వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో సాగిన క్రిస్మస్‌ సంబరాల్లో భాగంగా ఖతర్‌లోని వివిధ చర్చిలలో ప్రజలు క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెలుగు ప్రవాసీయుల చర్చి అయిన క్రీస్తు సైనికుల సహవాసం ఆధ్వర్యంలో కరుణామయుడు, శిలువ యాగం చేసిన ప్రేమ స్వరూపుడు ఏసు క్రీస్తు జన్మదినోత్సవం ఘనంగా జరిగింది.

ఆంగ్లికన్ సెంటర్ ఫర్ రిలీజియస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో పాస్టర్లు రమన్, అమృత్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ఇరు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది తెలుగు క్రైస్తవులు పాల్గొన్నారు.


అంతకు ముందు వారం రోజులుగా చలిలో సైతం ముందస్తు వేడుకలలో పాల్గొనేందుకు దూర ప్రాంతాలైన అల్ ఖోర్, దుఖాన్, నిస్సేద్, సనయ్యాల నుండి కూడా పెద్ద సంఖ్యలో విశ్వాసులు వచ్చారు.

ఖతర్‌లోని తెలుగు చర్చిలలో ప్రముఖమైన క్రీస్తు సైనికుల సహవాసం ప్రతి రోజూ ప్రభువు బోధనలను ప్రచారం చేస్తుంది. ఈ చర్చిని నరసపురానికి చెందిన రమన్, తునికి చెందిన అమృత్‌లు నిర్వహిస్తున్నారు.

దేశంలోని ఇతర తెలుగు చర్చిలలో కూడా ప్రజలు క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

TANA న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

Updated Date - Dec 27 , 2025 | 07:35 PM