Share News

TANA న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 09:29 AM

తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్, వెటరన్స్ ఆఫ్ ఫారిన్ వార్స్ సైనికులు, వారి పిల్లలకు బొమ్మలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.

TANA న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు
TANA Newyork Team Charity Events

ఎన్నారై డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో ఆదివారం, డిసెంబర్ 21న రెండు ముఖ్యమైన సామాజిక సేవా కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.

తానా ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా సుమారు 750 పౌండ్ల ఆహార సామగ్రిని సఫోక్ వై జెసిసి కమ్యూనిటీ ఫుడ్ ప్యాంట్రీ, కమాక్, న్యూయార్క్‌కు విరాళంగా అందజేశారు. ఆహార కొరతతో బాధపడుతున్న స్థానిక కుటుంబాలకు ఈ విరాళం ఎంతో మేలు చేసింది. అదేవిధంగా, వెటరన్స్ ఆఫ్ ఫారిన్ వార్స్ (VFW), వీట్‌లీ హైట్స్, న్యూయార్క్‌లో సైనికుల పిల్లల కోసం ఆహారం, బొమ్మలు, పాఠశాల సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని తానా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సైనిక కుటుంబాల్లో ఆనందం, ఉత్సాహం వెల్లివిరిసింది.

TANA అధ్యక్షులు నరేన్ కొడాలి నాయకత్వంలో, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి సహకారంతో ఈ రెండు కార్యక్రమాలు జరిగాయి. TANA న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా సమన్వయం చేయగా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా దిలీప్ ముసునూరు, ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, శ్రీనివాస్ నాదెళ్ళ, రాజేశ్ కడియాల, కలీమ్ మహమ్మద్ సేవలందించారు.

3.jpg


ఈ కార్యక్రమాల విజయానికి ముఖ్య కారణమైన మన యువ వాలంటీర్లు ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతిక చల్లా, రజిత్ రెడ్డి, రమ్య రెడ్డి, లోహితాక్ష్ సాయి నాదెళ్ల , విష్ణు సాయి ఆశ్రిత్ రాచకుంట, సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటి, ఆరిజ్ మహమ్మద్ మరియు ఐరా మహమ్మద్‌లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఫుడ్ గివ్ అవే కార్యక్రమానికి ప్రధాన సహకారం అందించిన కమ్యూనిటీ లీడర్ ప్రసాద్ కంభంపాటి, ఈవెంట్స్‌కు మద్దతు అందించిన శిరీష తూనుగుంట్ల, సైలజ చల్లపల్లికి తానా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.

సఫోక్ వై జెసీసీ ఫుడ్ ప్యాంట్రీ సిబ్బంది, వాలంటీర్లు, అలాగే వీఎఫ్‌డబ్ల్యూ సైనికులు, వారి పిల్లలు, తమకు అండగా నిలిచిన తానాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజ సేవే లక్ష్యంగా, అందరం కలిసి ముందుకు సాగుతూ, సార్థకమైన మార్పును తీసుకురావడానికి తానా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు ఒక ప్రకటనలో తెలిపారు.

4.jpg5.jpg6.jpg2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Updated Date - Dec 27 , 2025 | 09:36 AM