Share News

NRI TDP Kuwait felicitation: మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీతకు అభినందన సభ.

ABN , Publish Date - Dec 25 , 2025 | 06:44 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సయ్యద్ నాజర్.. మౌలానా అబుల్ కలాం అజాద్ 2025 అవార్డు అందుకున్నారు. ఆయనకు ఎన్.ఆర్. ఐ టీడీపీ కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ వెంకట్ కోడూరి అధ్యక్షతన అభినందన సభ ఘనంగా జరిగింది

NRI TDP Kuwait felicitation: మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీతకు అభినందన సభ.
felicitation ceremony Kuwait

మౌలానా అబుల్ కలాం అజాద్ 2025 సంవత్సర జాతీయ అవార్డు గ్రహీతకు ఎన్.ఆర్.ఐ. టీడీపీ కువైట్ అధ్వర్యంలో డిసెంబర్ 24వ తేదీన అభినందన సభ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సయ్యద్ నాజర్.. మౌలానా అబుల్ కలాం అజాద్ 2025 అవార్డు అందుకున్నారు. ఆయనకు ఎన్.ఆర్. ఐ టీడీపీ కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ వెంకట్ కోడూరి అధ్యక్షతన అభినందన సభ ఘనంగా జరిగింది (Maulana Abul Kalam Azad National Award 2025).


ఈ సందర్భంగా వెంకట్ కోడూరి మాట్లాడుతూ.. నాజర్ గారు ఒక మంచి కవి అని, ఆయన సందేశాలు సమాజ ఐక్యత, సామాజిక చైతన్యానికి ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు (TDP NRI Kuwait event). సమాజంలో జ్ఞానం, సమానత్వం, మానవత్వ విలువలు వ్యాప్తి చేయడంలో కవుల పాత్ర అభినందనీయమని అన్నారు.


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కువైట్ హరి రాయల్, టీడీపీ నాయకులు రాచూరి మోహన్, ముస్తాక్ ఖాన్, ఏం.డి. అర్షద్, రెడ్డయ్య చౌదరి, రవి, రామకృష్ణ, కరీం, బాబ్జీ, శ్యామ్, జనసేన నాయకులు మల్లిఖార్జున, గంగా తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Updated Date - Dec 25 , 2025 | 06:51 PM