Share News

Riyadh Christmas Celebrations: సాటా సెంట్రల్ క్రిస్మస్ వేడుకలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 08:10 PM

తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో శుక్రవారం క్రిస్మస్ పండుగ వైభవంగా జరిగింది.

Riyadh Christmas Celebrations: సాటా సెంట్రల్ క్రిస్మస్ వేడుకలు
Riyadh Christmas celebration

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఏ పండుగ అయినా దాన్ని తెలుగుతనంతో తన్మయం చేసుకుని తెలుగు సంస్కృతికి అనుగుణంగా జరుపుకోవడం తెలుగు వారి ప్రత్యేకత. మాతృభూమికి దూరంగా విదేశాలలో ఉండే తెలుగు ప్రవాసీయులు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటారని చెప్పొచ్చు.

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో శుక్రవారం జరిగిన క్రిస్మస్ పండుగ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించింది. తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో కరుణామయుడు, శిలువ యాగం చేసిన ప్రేమ స్వరూపుడు ఏసు క్రీస్తు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ విశ్వాసులతో పాటూ అబ్రహాం సంతానంగా భావించే ముస్లింలు, వసుధైక కుటుంబ స్ఫూర్తితో సహనం, ఐక్యత బోధించే హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ విశిష్ఠతను చాటారు.

జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడు గానూ, దయామయుడు గానూ ప్రపంచంలోని క్రైస్తవుల రాధనలను అందుకుంటున్నాడని కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఉషా దుగ్గపు అన్నారు.

3.jpg


అజిజీయా తెలుగు చర్చి పక్షాన పాస్టర్ విల్సన్, రియాధ్ తెలుగు ఫెలోషిప్ పక్షాన స్టాన్లీ జోసేఫ్ బైబిల్‌లోని వాక్యాలు చదివి వినిపించడంతోపాటు క్రీస్తు బోధనలను వివరించారు. పాస్టర్ సతీష్ డేవిడ్ (సి.సి.యఫ్) క్యాండిల్ లైటు సర్వీసును ప్రారంభించగా ఉజ్జయిని మినిస్ట్రీస్ పక్షాన సతీష్ కుమార్ కూడా వాక్యాలు వినిపించారు. రియాధ్ పీస్ గోస్పెల్ పక్షాన లక్ష్మణ్ స్టీఫెన్ కూడా సేవలో పాల్గొన్నారు.

అలంకరణ, శాంటాక్లాజ్ వేషధారణ క్రిస్మస్ వేడుకలలో ముఖ్యభూమిక వహిస్తాయి. క్రిస్మస్ అలంకరణను ఆకర్షణీయంగా ప్రియాంక బిల్లా, సుచరిత, రజనీ, సునీతలు తీర్చిదిద్దారు. సంధ్య, శ్రీలక్ష్మి, అరుణ, విజయలక్ష్మిలు వీరికి తోడుగా నిలిచారు.

ఎర్రన్న, ముజ్జమ్మీల్ షేఖ్, పోకూరి ఆనంద్, వెంకట రావు, షౌకత్ అలీ, వంశీ, జగదీశ్, రాంబాబు, థామన్, శ్రీనాథ్, అనిల్‌లు కూడా కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త డాక్టర్ ఇద్రీస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. భువనేశ్వరి గ్రూప్ వేడుకలకు సహకరించింది.

1.jpg4.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

ఖతర్‌లోని క్రీస్తు సైనికుల సహవాసం చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

TANA న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

Updated Date - Dec 27 , 2025 | 10:11 PM