ఏ దేశ మేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్న విధంగా దీపావళి వేడుకలు కెనడా టొరంటో ఘనంగా నిర్వహింపబడినవి.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తానా సాహిత్య విభాగం.. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల సాహిత్య భేరిని నిర్వహిస్తుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా బాల సాహితీవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది.
న్యూజెర్సీలో తానా, కళావేదిక, గుడ్ వైబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్ర గాన లహరి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు సుమారు 2 వేల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం తమకు కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చిందని కామెంట్ చేశారు.
జర్మనీలోని ఫ్రాంక్ఫార్ట్ నగరంలో శ్రీవారి శోభ ప్రజ్వరిల్లింది. తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
కార్మిక చట్టాలపై విదేశీయులకు అవగాహన కల్పించే కువైత్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ తాజాగా దేశంలోని వివిధ రాయబార కార్యాలయ ప్రతినిధులు, ప్రవాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి మరో అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
ఒమాన్‌లో తెలుగు వారు కార్తీక మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో సహస్ర లింగార్చన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక ఎన్నారైలు పాల్గొన్నారు.
సౌదీలో వివిధ ఎన్నారై సంఘాల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక అరబ్ ప్రముఖులు, భారతీయ దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ప్రకృతి విపత్తు మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయంగా.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మానవతా సేవా కార్యక్రమాన్ని చేపట్టింది.
అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఛైర్మన్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. అమెరికాలోని ఉత్తర కరోలీనాలో షార్లెట్‌లో నాట్స్ తన నూతన విభాగాన్ని ప్రారంభించింది.
ప్రభుత్వ బీమా పథకంపై సౌదీలోని కేరళ వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రవాసీ ప్రముఖులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభలు, సమావేశాలపై సౌదీ అరేబియాలో నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.