Share News

NTR: గల్ఫ్ దేశాల్లో ఎన్టీఆర్ వర్ధంతి.. టీడీపీ కార్యకర్తల ఘన నివాళులు

ABN , Publish Date - Jan 19 , 2026 | 07:19 PM

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

NTR: గల్ఫ్ దేశాల్లో ఎన్టీఆర్ వర్ధంతి..  టీడీపీ కార్యకర్తల ఘన నివాళులు
NRIs Pay Tribute to NTR

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మహా నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా సోమవారం గల్ఫ్ దేశాలలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులు ఆర్పించారు.

సౌదీ అరేబియాలో..

తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా ఆధ్వర్యంలో రాజధాని రియాధ్ నగరంలో జానీ బాషా ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఎడారి నలుమూలలకు నుండి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతాన్ని తెలుగునాట శ్రీకారం చుట్టిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని జానీ బాషా పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో తాము ప్రవాసీయుల కోసం పని చేస్తున్నట్లుగా మరో నాయకుడు రాజశేఖర్ చెన్నుపాటి చెప్పారు. మూడు దశాబ్దాలు గడిచినా నిత్యం ప్రజల మనస్సులో నిలిచి ఉన్న యుగ పురుషుడు ఎన్టీఆర్ అని సారథినాయుడు వడ్లమూడి అన్నారు. ఈ కార్యక్రమంలో భవానీ శంకర్ బోగినేని, శిల్పా గడ్డం, నరేశ్ చెన్నుపాటి, అనంత శ్రీనివాస్ దాడి, సత్తిబాబు చోలంగి, శ్రీకాంత్ దండ, బాలాజీ దొనబోయిన, మధు బొల్లెపల్లి, భారతీ వీరపల్లి, సింధూర అన్నె తదితరులు పాల్గొన్నారు.

Saudi Arabia 2.jpg


బహ్రెయిన్‌లో..

తెలుగుదేశం పార్టీ అభిమానులు బహ్రెయిన్‌లో కూడా మహా నాయకుడు ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని తెలుగుదేశం ప్రవాసీ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా బహ్రెయిన్‌లోని పార్టీ నాయకులను ఉద్దేశించి శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వీడియో కాల్ ద్వారా ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా బలపర్చిన ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడానికి నేటి తరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రఘునాథ్ బాబు, హరిబాబు, సతీష్ శెట్టి, రాంమోహన్, సతీశ్, ఇంతియాజ్ అహ్మద్, మౌళి చౌదరి, కిషోర్, అనిల్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Bahrain.jpgBahrain 2.jpg

కువైత్‌లో..

పిట్ట కొంచె కూత ఘనం అన్నట్లుగా సంఖ్యాపరంగా, భౌగోళికంగా చిన్న దేశమైనప్పటికీ కువైత్... తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల విషయానికి వస్తే మాత్రం మిగిలిన వారి కంటే క్రియాశీలకంగా ఉంటుంది. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు సుధాకర్ రావు కుదరవల్లి, ఈశ్వర్లు నిర్వహించగా కొల్లి అంజనేయులు, షేఖ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్మరణలో పార్టీ నాయకులు వెంకట్ కోడూరి, సుబ్బరాయుడు, బాల రెడ్డయ్య, రెడ్డి మోహన్, రమేష్ నాయుడు, ముశ్తాఖ్ ఖాన్, నారాయణమ్మ, శంకర్, నగేశ్, రెడ్డయ్య చౌదరి, అర్షద్‌లు కూడా కార్యక్రమాన్ని నిర్వహించి ఘన నివాళులు అర్పించారు.

Kuwait.jpgKuwait 2.jpg

దుబాయిలో..

దుబాయి ఎమిరేట్‌లో కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వర రావు పూలమాల వేసి లాంఛనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ ప్రముఖులు, అభిమానులు ఇందులో పాల్గొన్నారు.

Dubai.jpg


ఒమాన్‌లో..

ఒమాన్‌లో కూడా టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మస్కట్ నగరంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్య శ్రీధర్, రాఘవేంద్ర, వాసు బాబు, మురళీ వడపట్ల, హరికృష్ణ, నాగరాజు, అనిల్ కుమార్, రాజేశ్, చంద్ర, మురళి కృష్ణ, రామచంద్ర తదితరులు నిర్వహించారు.

Oman.jpg

ఖతర్‌లో..

ఖతర్‌లో కూడా ఒక వర్గం తెలుగుదేశం అభిమానులు ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. సీనియర్ ప్రవాసీ శాంతయ్య నివాసంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రమణ, సత్య, రమేశ్ దాసరి, సాయి తదితరులు పాల్గొన్నారు.

గల్ఫ్ దేశాలల్లో వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తెలుగు దేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

Qatar.jpg


ఇవీ చదవండి:

న్యూజెర్సీలో 'నారీ శక్తి' కార్యక్రమం.. హాజరైన బీజేపీ నాయకురాలు మాధవీలత

టీఏజే సంస్థ ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు

Updated Date - Jan 19 , 2026 | 07:56 PM