Sankranti Celebrations: టీఏజే సంస్థ ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:50 PM
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పాటలు, ఆటల పోటీలు వంటి కార్యక్రమాలు ఎన్నారైలను అలరించాయి.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్(TAJ) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వనభోజనాలు, టగ్ ఆఫ్ వార్, చిత్రలేఖనం, క్రికెట్ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీ, కైట్ ఫెస్టివల్ వంటివి నిర్వహించారు. గత శనివారం నిర్వహించిన ఈ వేడుకల్లో నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రవాసులను అలరించాయి.
జపాన్‌తో పాటు పలు దేశాల్లో ఎన్నారైలు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. స్థానిక ఎన్నారై సంఘాల ఆధ్వర్యంలో గల్ఫ్, అమెరికా, ఐరోపాల్లో భారత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి:
న్యూజెర్సీలో 'నారీ శక్తి' కార్యక్రమం.. హాజరైన బీజేపీ నాయకురాలు మాధవీలత
మెల్బోర్న్‌లో ప్రవాసుల సంక్రాంతి వేడుక