Share News

Melbourne Sankranti Celebrations: మెల్బోర్న్‌లో ప్రవాసుల సంక్రాంతి వేడుక

ABN , Publish Date - Jan 18 , 2026 | 10:30 PM

మెల్బోర్న్‌లో ఎన్నారైలు సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

Melbourne Sankranti Celebrations: మెల్బోర్న్‌లో ప్రవాసుల సంక్రాంతి వేడుక
Melbourne Telugu community Sankranti Celebrations

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో నివసిస్తున్న తెలుగు ప్రవాసులు సాంప్రదాయ వైభవంతో సంక్రాంతి సంబరాలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు (Melbourne Sankranti Celebrations).

ఈ కార్యక్రమంలో, ముగ్గుల పోటీలు, లక్ష్మీ దేవి పూజా కార్యక్రమం, సంక్రాంతి ఆటలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు, జానపద పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు, యువత, పండుగ శోభను మరింత పెంచారు.

2.jpg


కార్యక్రమానికి హాజరైన పెద్దలు మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. పిల్లలకు భారతీయ విలువలు, పండుగల ప్రాముఖ్యత తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా అతిథుల కోసం సిద్ధం చేసిన అరిసెలు, గారెలు, బొబ్బట్లు, పాయసం వంటి సంప్రదాయక వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమం ద్వారా మెల్బోర్న్‌లోని తెలుగు సమాజం ఒక్కటిగా కలిసిపోతూ, తమ మాతృభాషా సంస్కృతి పట్ల ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది. నిర్వాహకులు లగడపాటి సుబ్బారావు, గోపి నంబాళ్ళ, రామ్ ముప్పానేని, హరి శేఖర్ గౌడ్, స్నేహలత రెడ్డి కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


ఇవీ చదవండి:

న్యూజెర్సీ ప్రవాసులతో బీజేపీ నాయకురాలు మాధవీలత సమావేశం

TANTEX నూతన అధ్యక్షురాలిగా లోకిరెడ్డి మాధవి

Updated Date - Jan 19 , 2026 | 08:03 AM