BJP Leader Madhavi Latha: న్యూజెర్సీ ప్రవాసులతో బీజేపీ నాయకురాలు మాధవీలత సమావేశం
ABN , Publish Date - Jan 17 , 2026 | 09:34 PM
న్యూజెర్సీలోని ఎన్నారైలతో నేడు తెలంగాణ బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో డాలస్‌లో కూడా ఆమె పర్యటిస్తారని జీహెచ్హెచ్ఎఫ్ అధ్యక్షుడు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత శనివారం న్యూజెర్సీలో స్థానిక ప్రవాసులతో సమావేశం కానున్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్(GHHF) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని శివ విష్ణు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకుల్లో ఒకరైన గుడిపాటి కృష్ణ వెల్లడించారు. మాధవీలత ఫిబ్రవరి 18,19,20 తేదీల్లో డాలస్‌లో పర్యటిస్తారని జీహెచ్హెచ్ఎఫ్ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశరావు తెలిపారు.

ఇవీ చదవండి:
TANTEX నూతన అధ్యక్షురాలిగా లోకిరెడ్డి మాధవి
ఖతర్‌లో తెలంగాణ ప్రముఖురాలికి నారీశక్తి సమ్మాన్ ఆవార్డు