Share News

Madhavi Latha: న్యూజెర్సీలో 'నారీ శక్తి' కార్యక్రమం.. హాజరైన బీజేపీ నాయకురాలు మాధవీలత

ABN , Publish Date - Jan 19 , 2026 | 02:11 PM

న్యూజెర్సీలో జరిగిన నారీ శక్తి కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు మాధవీ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం విశిష్టత గురించి ప్రసంగించారు. ధర్మ పరిరక్షణలో మహిళ పాత్ర గురించి పేర్కొన్నారు.

Madhavi Latha: న్యూజెర్సీలో 'నారీ శక్తి' కార్యక్రమం.. హాజరైన బీజేపీ నాయకురాలు మాధవీలత
BJP Leader Madhavi Latha in Naari Shakti Event

ఇంటర్నెట్ డెస్క్: న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు దేవాలయం ప్రాంగణంలో సాయి దత్త పీఠం అండ్ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ – నారీ శక్తి కార్యక్రమం ఉత్తేజకరంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సనాతన ధర్మ పరిరక్షకురాలు బీజేపీ నేత మాధవి లత కొంపెల్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, సమాజ సభ్యులను ఆధ్యాత్మికంగా ముందుకు సాగేలా ప్రోత్సహించారు. సభను ఉద్దేశించి మాట్లాడిన మాధవి లత కొంపెల్ల, సనాతన ధర్మం శాశ్వత ప్రాసంగికత గురించి వివరించారు. ధార్మిక విలువల ద్వారా యువతకు మార్గనిర్దేశనం చేయాలని అన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యంతో మహిళలను శక్తివంతం చేయడం ముఖ్యమని వివరించారు.

ఈ అంశంపై మాధవీ లోతైన ప్రసంగం చేశారు. ‘వ్యక్తులను, కుటుంబాలను, సమాజాన్ని బలోపేతం చేసే శాశ్వత సూత్రాలను సనాతన ధర్మం అందిస్తుంది. మహిళలు ఆధ్యాత్మికంగా శక్తివంతమైతే, భవిష్యత్ తరాల కోసం ధర్మానికి స్తంభాలుగా నిలుస్తారు’ అని అన్నారు. సంస్కృతి, విలువల పరిరక్షణలో మహిళల పాత్రను హైలైట్ చేశారు. ఈ కార్యక్రమం మొత్తం శ్రీ శివ విష్ణు దేవాలయం ప్రాంగణంలో ప్రత్యక్షంగా జరిగింది. దేవాలయ డిజిటల్ వేదికల కార్యక్రమాన్ని నిర్వాహకులు లైవ్ స్ట్రీమింగ్ చేశారు.

ఆలయ ప్రాంగణానికి బయట ఉన్న భక్తులు కూడా విస్తృతంగా పాల్గొన్నారు. దేవాలయ వ్యవస్థాపకులు, ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి మాట్లాడుతూ, ‘న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో శ్రీమతి మాధవి లత కొంపెల్లను ఆహ్వానించడం మా గౌరవంగా భావిస్తున్నాము. ఆమె వేద విజ్ఞానం, స్పష్టమైన ఆలోచన విధానం యువతను, పెద్దలను సనాతన ధర్మంతో మరింత లోతుగా అనుసంధానించేందుకు ప్రేరేపిస్తోంది. ‘నారీ శక్తి’ వంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక వికాసం, సాంస్కృతిక నిరంతరతను పెంపొందించాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి’ అన్నారు.

3.jpg


ఈ కార్యక్రమానికి అన్నివిధాలా సహకరించిన, సత్య నేమన, కృష్ణ గుడిపాటి, విలాస్ జంబులను రఘుశర్మ శంకరమంచి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపించేందుకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, దేవాలయ ట్రస్టీలు, వాలంటీర్లు, సిబ్బంది సమిష్టిగా అహర్నిశలు కృషి చేశారు. శ్రీ శివ విష్ణు దేవాలయం, న్యూజెర్సీ, సాయి దత్త పీఠం అండ్ సాంస్కృతిక కేంద్రం సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకుని, ఆధ్యాత్మిక విద్య, సాంస్కృతిక చర్చలు, సమాజ సేవలకు వేదికలుగా నిరంతరం సేవలందిస్తున్నాయి.

ఈ సందర్భంగా, కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేకంగా రూపొందించిన మూడు వీడియో క్లిప్స్‌ను ప్రదర్శించారు. ఈ క్లిప్స్ ద్వారా మాధవి లత, డా. ప్రకాశరావు, రఘుశర్మ శంకరమంచి సనాతన ధర్మ పరిరక్షణకు, ఆధ్యాత్మిక సేవలకు, సమాజానికి చేసిన సేవలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ వీడియోలకు ప్రేక్షకుల్లో విశేష స్పందన లభించింది. అనంతరం, దేవాలయ ఆలయ మర్యాదలతో రఘుశర్మ మాధవీ లతకు వేద ఆశీర్వచనం అందించారు. అదేవిధంగా, ‘సనాతనం శ్వాసగా’ అనే ఆధ్యాత్మిక భావనతో రూపొందించిన వీడియో పాటను ఈ కార్యక్రమంలో అధికారికంగా మాధవి లత విడుదల చేశారు. ఈ పాటను ఎడిసన్‌లో నివసిస్తున్న ప్రముఖ రచయిత కంభమ్మెట్టు శేషగిరిరావు (గిరి) రచించగా, విలాస్ రెడ్డి జంబుల, కొల్లా శ్రీనివాసరావు (వాసు) సంయుక్తంగా నిర్మాణం చేశారు. సనాతన ధర్మం మన జీవన విధానంలో శ్వాసలా భాగమై ఉండాలనే సందేశంతో రూపొందిన ఈ పాట, భక్తుల హృదయాలను ఆకట్టుకుంది.

4.jpg

ఈ ప్రత్యేక కార్యక్రమాలు నారీ శక్తి వేదికకు మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువచ్చి, సనాతన ధర్మంపై సమాజంలో అవగాహనను మరింత బలోపేతం చేశాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా, విలాస్ జంబుల వేదికపై ధన్యవాదాల తీర్మానాన్ని (Vote of Thanks) సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథి మాధవి లత కొంపెల్లకు, దేవాలయ వ్యవస్థాపకులు, ట్రస్టీలు, నిర్వాహకులు, వాలంటీర్లు, సిబ్బంది, కార్యక్రమానికి హాజరైన భక్తులు, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నారీ శక్తి వంటి కార్యక్రమాలు సనాతన ధర్మ పరిరక్షణకు, సమాజ ఆధ్యాత్మిక చైతన్యానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. అమెరికా వ్యాప్తంగా మాధవీలత 13 నగరాల్లో పర్యటిస్తారని, ఫిబ్రవరి 18,19,20 తేదీల్లో డాలస్ ప్రవాసులతో సమావేశమవుతారని ఆమె పర్యటనను సమన్వయపరుస్తున్న జీహెచ్ఎఫ్ఎఫ్ సంస్థ అధ్యక్షుడు డా. వెలగపూడి ప్రకాశరావు తెలిపారు.

1.jpg5.jpg2.jpg


ఇవీ చదివండి:

మెల్బోర్న్‌లో ప్రవాసుల సంక్రాంతి వేడుక

న్యూజెర్సీ ప్రవాసులతో బీజేపీ నాయకురాలు మాధవీలత సమావేశం

Updated Date - Jan 19 , 2026 | 02:17 PM