తెలంగాణ విమానయాన తయారీ రంగంలో వృత్తి నైపుణ్యత పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అమెరికాలోని బోయింగ్ విమాన తయారీ సంస్థ శాస్త్రవేత్త, పరిశోధన విభాగ అధిపతి ప్రో. మామిడాల రాములు అన్నారు.
గుంటూరు నాట్స్ ఆధ్వర్యంలో జానపద సంబరాలు ఘనంగా జరిగాయి. తప్పెటగుళ్లు, దరువులు, కోలాటాల సందడి.. తెలుగు జానపద శోభను ప్రతిబింబించాయి.
తానా కళాశాల 2025–26 విద్యాసంవత్సరానికి భారతీయ నృత్య–సంగీత డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ వెలువరించింది. కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం , వీణ వంటి శాస్త్రీయ కళలలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సెయింట్ లూయిస్‌లో నివసించే ప్రవాస ఆంధ్రుల కోసం ఉచిత ఆహార సేకరణ చేపట్టింది తానా సౌత్ సెంట్రల్ విభాగం. అందులో భాగంగా సుమారు 200 కుటుంబాలకు సరిపోయే ఆహారాన్ని సేకరించి ఫుడ్ బ్యాంక్‌కు విరాళమందించింది.
కంటి సంరక్షణా, వైద్య సేవా కార్యక్రమాల గురించి సమాజంలో అవగాహన పెంచడానికి శంకర నేత్రాలయ చికాగో చాప్టర్ డిసెంబర్13న అరోరా ప్రాంతంలో ఒక చలనచిత్ర సంగీత కచేరీని నిర్వహించింది.
జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సహకారంతో, సంస్థ బోర్డు ఆఫ్ ట్రస్టీ విష్ణు ప్రకాష్ రావు మాధవరం సొంత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఛార్లెట్‌లోని రూఫ్ అబోవ్ షెల్టర్ వద్ద ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పిజ్జా, వింగ్స్, సోడాతో కూడిన ఆహారాన్ని అందించారు. దీనితో పాటు 1,000 పౌండ్ల బరువున్న 400 క్యాన్డ్ ఫుడ్ ఐటమ్స్ బ్యాగులను విరాళంగా అందజేశారు.
దివ్యాంగులైన భారతీయ చిన్నారులకు ఔట్‌రీచ్ ఖతర్ సంస్థ అండగా నిలుస్తోంది. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా సంతోషం వెల్లివిరిసేలా చేస్తోంది.
ఖతర్ నుంచి వచ్చిన ఎన్నారై పంచిత ధర్మరాజు యాదవ్ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ప్రజలు విజ్ఞులని, అభివృద్ధి ఎజెండాను అర్థమయ్యే రీతిలో వివరిస్తే గెలిపిస్తారని ఆయన అన్నారు.
ప్రవాసీయులలో పురస్కారం ప్రహసనంగా మారిపోయింది. శాలువా సత్కారాలు ప్రస్తుతం విలువ కోల్పోతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.