Share News

తెలుగు ప్రవాసీయుల ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ బహ్రెయిన్ – క్లీన్ బహ్రెయిన్’

ABN , Publish Date - Jan 30 , 2026 | 09:42 PM

తెలుగు ప్రవాసీయుల ఆధ్వర్యంలో సాగుతున్న స్వచ్ఛ బహ్రెయిన్ - క్లీన్ బహ్రెయిన్ కార్యక్రమం 100 వారాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తెలుగు ప్రవాసీయుల ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ బహ్రెయిన్ – క్లీన్ బహ్రెయిన్’
Swachh Bahrain Event

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో బహ్రెయిన్‌లో తెలుగు ప్రవాసీయులు ప్రారంభించిన సముద్ర తీరంలో వ్యర్థాల తొలగింపు కార్యక్రమం100 వారాలకు చేరుకుంది.

స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో, తెలుగు ఈకో వారియర్స్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ బహ్రెయిన్ – క్లీన్ బహ్రెయిన్’ కార్యక్రమాన్ని బహ్రెయిన్‌లోని సీఫ్ బీచ్ వద్ద (భారత రాయబార కార్యాలయం వెనుక భాగంలో) ఘనంగా నిర్వహించారు. సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

100 వారాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బహ్రెయిన్ బోర్స్ సీఈఓ షేక్ ఖలీఫా బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

2.jpg


ఈ కార్యక్రమానికి షిఫా అల్ జజీరా సీఈఓ అండ్ డైరెక్టర్ హబీబ్ రెహ్మాన్ సహ-ప్రాయోజకులుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమాన్ని రామమోహన్ కొతపల్లి, నవీన్ కొటగిరి, తెలుగు ఈకో వారియర్స్ సభ్యులు సంయుక్తంగా నిర్వహించారు. బహ్రెయిన్‌ను తమ కార్యస్థలంగా గర్వంగా భావిస్తున్నామని, ఆ దేశ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని సభ్యులు తెలిపారు.

కార్యక్రమ నిర్వహణకు సంపూర్ణ సహకారం అందించిన బహ్రెయిన్ ప్రభుత్వానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ, ప్రజా అవగాహనపై తమ నిబద్ధతను చాటుకుంటూ భవిష్యత్తులో కూడా సమాజం, ప్రకృతి మేలు కోసం ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలుగు ఈకో వారియర్స్ ప్రకటించారు.

3.jpg


ఇదీ చదవండి:

గల్ఫ్‌లో తెలుగు లోకమంతా లోకేశ్ జన్మదిన జపం

చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుక.. ముగ్గుల పోటీలు

Updated Date - Jan 30 , 2026 | 09:49 PM