గల్ఫ్‌లో తెలుగు లోకమంతా లోకేశ్ జన్మదిన జపం
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:59 PM
గల్ఫ్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లోకేశ్ జన్మదినోత్సవాన్ని నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు శుక్రవారం గల్ఫ్ దేశాలలో ఘనంగా నిర్వహించాయి.
గల్ఫ్ దేశాలలోని తెలుగుదేశం పార్టీ బాధ్యులను ఉద్దేశించి మంత్రులు నిమ్మల రామనాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీఎస్ ఛైర్మన్ వేమూరి రవి, రాష్ట్ర బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్, సీనియర్ ఎన్నారై బుచ్చిరాం ప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ప్రవాసీయుల పాత్రను ప్రశంసించారు. పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఉత్సాహంతో ముందుకు వచ్చి జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొన్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ అంశాలపై మంత్రులు రామానాయుడు, శ్రీనివాస్‌లతో మాట్లాడారు.
యువ గళ సారధి నారా లోకేశ్ జన్మదినోత్సవ స్ఫూర్తిగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో, ఒమాన్ లోని మస్కట్ నగరాలలో తెలుగుదేశం పార్టీ అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కువైత్‌లో..
భౌగోళికంగా అరబ్బు ఎడారిలో ఉన్నప్పటికీ కువైత్‌లోని తెలుగు ప్రవాసీయులను సంఖ్యాపరంగా చూస్తే అన్నమయ్య జిల్లాలో ఒక భాగమని చెప్పొచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అంకితభావంతో పని చేసే కార్యకర్తలు కలిగిన కువైత్‌లోని తెలుగుదేశం పార్టీ.. నారా లోకేశ్ జన్మదినోత్సవ వేడుకలను అదే స్థాయిలో ఘనంగా నిర్వహించింది. పార్టీ సీనియర్ నాయకుడు, జి.సి.సి సభ్యుడు వెంకట్ కోడూరి అధ్యక్షతన మంగఫ్‌లో జరిగిన సభలో మహిళలతో సహా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాస్తవానికి కువైత్‌లో ప్రస్తుత తనిఖీల పర్వంలో ఈ రకమైన సమావేశాన్ని నిర్వహించడం సవాలుతో కూడుకున్న పని.
ఈ సందర్భంగా జరిగిన సభలో NRI TDP కువైత్, జనసేన నాయకులు సుబ్బారాయుడు, ఉదయ్ ప్రకాశ్, దివాకర్ రెడ్డి, మోహన్, కంచన శ్రీకాంత్, ముస్తాక్ ఖాన్, బాలారెడ్డియ్య, నారాయణమ్మ, ప్రసాద్, రెడ్డయ్య చౌదరి, రమేష్, రషీదా, దివ్య, అర్షద్, రవి, రామకృష్ణ, మురళీ, శివ, అలీ, మల్లికార్జున్‌లు మాట్లాడుతూ నారా లోకేశ్ రాజకీయ ప్రస్థానం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రశంసించారు.
సుధాకర్ రావు కుదరవల్లి నేతృత్వంలో కూడా వేరుగా ఫర్వానియా ప్రాంతంలో మద్దిన ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన లోకేశ్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు షేక్ బాషా, సుబ్బా రెడ్డి, బిల్లా రమేష్, రషీద, కొల్లి ఆంజనేయులు, వేణు రాజు, చిన్నా రాజు, మహేష్, రెడ్డి శేఖర్, జనసేన నాయకులు కంచన శ్రీకాంత్, ఆలి, బాలాజి, ప్రేం రాయల్ తదితరులు పాల్గొన్నారు.


సౌదీ అరేబియాలో..
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నారా లోకేశ్ జన్మదినాన్ని జగమంత సంబరంగా జరుపుకున్నారు. పార్టీ నేతలు జానీ బాషా, రాజశేఖర్ చెన్నుపాటిల నేతృత్వంలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఆసుపత్రి వద్ద కార్యకర్తలు గుంపుగా కూడడంతో భద్రత సిబ్బంది వారిని వంతుల వారీగా లోనికి పంపారు. రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందించారు. పార్టీ ప్రముఖులు సారధినాయుడు వడ్లమూడి, భవానీ శంకర్ బోగినేని, గడ్డం శిల్ప, నరేశ్ చెన్నుపాటి, ఆనంద్ పోకూరి, అనంత శ్రీనివాస్ దాడి, ఆనందకుమార్ మలిశెట్టి, శ్రీకాంత్ దండ, బాలాజీ దానబోయిన, మధు బోలెపల్లి, సుచరిత, భారతీ వీరపల్లి, నరేంద్ర పల్లేరు, శాలనీ, వంశీ కృష్ణ కొల్లి, మల్లిఖార్జున ప్రతిపాటి, శివశేఖర్, వరుణ్ కుమార్ వైటల తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేసారు. కేకు కట్ చేసి కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులకు రుచికరమైన విందు భోజనాలను ఏర్పాటు చేశారు. పార్టీ నాయకుడు రాజశేఖర్ చెన్నుపాటి మాట్లాడుతూ విజయవాడ నగరానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచాల్సిందిగా మంత్రులను కోరారు.



ఒమాన్‌లో..
ఒమాన్‌లోని మస్కట్ నగరంలో కూడా నారా లోకేశ్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుదూర ఎడారి ప్రాంతాలైన సుర్, సోహార్, నిజ్వాల నుండి కూడా పార్టీ వీరాభిమానులు రాజధాని మస్కట్‌కు చేరుకుని తమ ప్రియతమ నాయకుడి జన్మదినోత్సవ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు గారపాటి సత్యశ్రీధర్, రాఘవేంద్ర, వాసుబాబు, అనిల్ నగిడి, మురళీ వడపట్ల, మురళీకృష్ణ,కిరణ్ కొడాలి, పవన్ కుమార్, రామచంద్ర, నాగరాజు, అనిల్ కుమార్, రాజేశ్, గిరి, రమేశ్‌లు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రక్తదాన శిబిరం కూడ అంచనాలకు మించి విజయవంతమైంది.


ఖతర్‌లో..
ఖతర్‌లో కూడా తెలుగు దేశం పార్టీ శ్రేణులు నారా లోకేశ్ జన్మ దినోత్సవాన్ని సంక్రాంతి పండుగ సంబరాల స్ధాయిలో జరుపుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య నేతృత్వంలో జరిగిన వేడుకలలో పార్టీ అభిమాన కుటుంబాలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. వసంత పంచమి రోజు లోకేశ్ జన్మదినోత్సవం కలిసి రావడం సంతోషకరమని రమణయ్య అన్నారు.
మరో వైపు ఖతర్‌లో పార్టీ ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేశ్, ప్రధాన కార్యదర్శి రవి పొనుగుమటి, కోశాధికారి విక్రం సుఖవాసీలతో పాటు సీనియర్ నాయకులు జె.వి.వి సత్యనారాయణ, బొడ్డు రామరావు, కొడాలి సుధాకర్, నిథలపాటి నరేశ్‌ల ఆధ్వర్యంలో అల్ ఖోర్ ప్రాంతంలోనూ లోకేశ్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రజల ముంగిట పార్టీ అనే లోకేశ్ స్ఫూర్తితో తాము దూర ప్రాంతాలలో పని చేసే ఉద్యోగ, కార్మికుల సౌకర్యార్ధం అల్ ఖోర్‌లో జన్మదినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించినట్లుగా నరేశ్ వెల్లడించారు.


బహ్రెయిన్‌లో..
బహ్రెయిన్‌లో యువనేత నారా లోకేశ్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కేక్ కట్ చేసిన అనంతరం ఒకరికొకరు తినిపించుకుంటూ వేడుకలను జరుపుకోగా అందులో పార్టీ ప్రముఖులు రఘునాథ్ బాబు, హరిబాబు, శివకుమార్, సతీష్ శెట్టి, సతీష్ బొల్ల, మోహన్, ఇంతియాజ్, చంద్రబాబు, కిషోర్, అనిల్ పి., పి.జె.నాయుడు, నాగార్జున, వాసు, జయరాంలు పాల్గొన్నారు.


యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయి ఏమిరేట్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేశ్ జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు మోతుకూరి విశ్వేశ్వరరావు ఆధ్యర్యంలో కార్యక్రమం జరిగింది.