అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించిన గల్ఫ్ తెలుగుదేశం నాయకులు
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:18 PM
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను గల్ఫ్ టీడీపీ ఎన్నారై శ్రేణులు ఖండించాయి. రాజకీయాల్లో హుందాగా నడుచుకోవాలని హితవు పలికాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై గల్ఫ్ దేశాలలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలను టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా ఖండించారు. విమర్శలు ఎప్పటికీ విధానాలపైనే ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదని హితవు పలికారు.
అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సౌదీ అరేబియాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు జానీ బాషా, రాజశేఖర్ చెన్నుపాటి తెలిపారు. బూతు పురాణాలను నమ్ముకున్న నాయకులకు చట్టబద్ధంగా తగిన శాస్తి జరగాలని అన్నారు.
అంబటి రాంబాబుపై తీసుకున్న చట్టపరమైన చర్యలను ఒమాన్‌లోని తెలుగుదేశం పార్టీ నాయకులు సమర్థించారు. ఈ మేరకు గారపాటి సత్యశ్రీధర్ ఆదివారం ఒక ప్రకటన చేశారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలకు స్థానం లేదని చెప్పారు.
వైసీపీ నాయకులు ఇంకా ఆటవిక రాజ్యాన్ని నమ్ముకొని అదే భ్రమల్లో విహరిస్తున్నారని ఖతర్‌లోని తెలుగుదేశం పార్టీ నాయకుడు మద్దిపోటి నరేశ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడటానికి ఉపక్రమించాలని కోరారు.
బూతులు మాట్లాడటం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని కువైత్‌లోని తెలుగుదేశం పార్టీ నాయకుడు కుదురవల్లి సుధాకర్ రావు విమర్శించారు. వైసీపీ నీచ సంస్కృతి విధానాలకు విసుగు చెందిన ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించినా జగన్ బృందం గుణపాఠం నేర్చుకోలేదని అన్నారు.
వైసీపీ అప్రజాస్వామిక విధానాలు, అసాంఘిక, అనైతిక చర్యలను బహ్రెయిన్‌లోని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది.
ఇవీ చదవండి:
తెలుగు ప్రవాసీయుల ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ బహ్రెయిన్ – క్లీన్ బహ్రెయిన్’
అంతర్వేది నరసింహస్వామి కళ్యాణోత్సవం! గల్ఫ్ నుంచి తరలివచ్చిన ఎన్నారైలు