కర్ణాటక రాజకీయాల్లో కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఒకచోట సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ఎయిర్‌బస్ ఏ320 రకం విమానాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగంలో తీవ్ర అలజడి సృష్టించాయి.
వాట్సాప్, టెలిగ్రామ్ తదితర మెసేజింగ్ యాప్‌లను స్కామ్‌స్టర్లు దుర్వినియోగం చేయకుండా అరికట్టేందుకు టెలికం శాఖ కొత్త ఆదేశాలను జారీ చేసింది.
కమ్యూనికేషన్ యాప్‌లు దుర్వినియోగం కాకుండా నిత్యం సిమ్ కార్డుతో అనుసంధానం అయ్యేలా చూడటమే తాజా చర్యల ఉద్దేశంగా డీఓటీ తెలిపింది. ప్రస్తుతం చాలా సర్వీసులు ఇన్‌స్టలేషన్ సమయంలో యూజర్ మెబైల్ నంబర్‌ను ప్రమాణంగా తీసుకుంటున్నాయి.
జమ్మూకశ్మీర్ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చిన 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్'కు సంబంధించి ఏడుగురికి పైగా అనుమానితులను ఇంతవరకూ అరెస్టు చేసారు. ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌కు నేరుగా ఢిల్లీ పేలుడుతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
బిహార్‌లో కాంగ్రెస్ పరాజయంపై ఇటీవల కూడా ఇందిరాభవన్‌లోనూ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరాజయానికి దారితీసిన పరిస్థితులపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థలను అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఇటీవల బిష్ణోయ్‌ను 11 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఎన్ఐఏ తరఫున అడ్వకేట్ కుష్‌దీప్ గౌర్‌తో కలిసి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి శనివారంనాడు విచారణ ముందుకు హాజరయ్యారు.
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్‌ను ఇంటి నుంచే మార్చుకునేందుకు వీలుగా యాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు యూఐడీఏఐ తాజాగా తెలిపింది. మరి ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్లకు పైగా ఆస్తులను రూ.50 లక్షల నామమాత్రపు చెల్లింపుతో కాంగ్రెస్ నేతలు అక్రమంగా చేజిక్కుంచుకున్నారని ఈడీ ప్రధాన ఆరోపణగా ఉంది.