Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితులకు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
ABN , Publish Date - Nov 29 , 2025 | 06:53 PM
జమ్మూకశ్మీర్ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చిన 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్'కు సంబంధించి ఏడుగురికి పైగా అనుమానితులను ఇంతవరకూ అరెస్టు చేసారు. ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌కు నేరుగా ఢిల్లీ పేలుడుతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో కీలక నిందితులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనయి, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథెర్, డాక్టర్ సహీన్ సయీద్, ముఫ్తో ఇర్ఫాన్ అహ్మద్ వాగాయ్‌లకు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పాటియాలా హౌస్ కోర్టు శనివారంనాడు ఆదేశించింది. ఇంతకుముందు విధించిన 10 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఈ నలుగురిని కోర్టు ముందు హాజరుపరిచారు.
జమ్మూకశ్మీర్ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చిన 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్'కు సంబంధించి ఇంతవరకూ ఏడుగురికి పైగా అనుమానితులను అరెస్టు చేసారు. ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌కు నేరుగా ఢిల్లీ పేలుడుతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆత్మహుతి పేలుడుకు సంబంధించిన ఆధారాలతో వివిధ రాష్ట్రాల్లో సోదాలు జరుపుతున్నామని, దాడిలో ప్రమేయమున్న వారిని గుర్తించేందుకు ఆయా రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో దర్యాప్తు సాగిస్తున్నామని ఎన్ఐఏ తెలిపింది.
కాగా, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనయి అద్దెకు తీసుకున్న రెండు నివాసాలను కూడా ఢిల్లీ పోలీసులు తాజాగా గుర్తించారు. తప్పుడు సమాచారం ఇచ్చి ఆ ఇళ్లను చాలాకాలంగా గనయి వాడుకుంటున్నాడు. తాను మాజీ సర్పెంచ్‌ననీ, పండ్ల వ్యాపారం చేయాలనుకుంటున్నానని ఆ ఇంటి యజమానికి గనయి చెప్పినట్టు, ఏప్రిల్ నుంచి జూలై వరకూ నెలసరి అద్దెగా రూ.8,000 చొప్పున చెల్లించినట్టు గుర్తించారు.అ ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే అల్-ఫలా యూనివర్శిటీ ఉంది. అరెస్టు ముందు వరకూ అందులోనే గనయి పనిచేశాడు.
ఇవి కూడా చదవండి..
గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ఎన్ఐఏ కస్టడీ డిసెంబర్ 5 వరకూ పొడిగింపు
ఈడీ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి