Rahul meets Kharge: ఖర్గేను కలిసిన రాహుల్.. బిహార్ నేతలు హాజరు
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:20 PM
బిహార్‌లో కాంగ్రెస్ పరాజయంపై ఇటీవల కూడా ఇందిరాభవన్‌లోనూ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరాజయానికి దారితీసిన పరిస్థితులపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థలను అడిగి తెలుసుకున్నారు.
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Khrge)ను ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారంనాడు కలుసుకున్నారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. బిహార్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కృష్ణ అల్లావరు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్, అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బిహార్‌లో పార్టీ పరాజయంపై ఇటీవల కూడా ఇందిరాభవన్‌లో ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరాజయానికి దారితీసిన పరిస్థితులపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఎన్డీయే రూ.10,000 ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రకటించడం, బిహార్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, టిక్కెట్ల పంపిణీలో జరిగిన జాప్యం వంటివి ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కొన్ని కారణాలుగా అభ్యర్థులు అధిష్ఠానానికి విన్నవించినట్టు తెలుస్తోంది.
బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ 'మహాగఠ్‌బంధన్'లో భాగంగా 61 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అయితే కేవలం 6 సీట్లలోనే గెలుపొందింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి రెండంకెల స్థాయి సీట్లు కూడా సంపాదించుకోలేక పోయింది. నాటి ఎన్నికల్లో 75 సీట్లు గెలిచిన మహాకూటమి భాగస్వామి పార్టీ ఆర్జేడీ సైతం ఈసారి కేవలం 25 స్థానాల్లోనే గెలిచింది. దీంతో మహాగఠ్‌బంధన్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది.
ఇవి కూడా చదవండి..
గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ఎన్ఐఏ కస్టడీ డిసెంబర్ 5 వరకూ పొడిగింపు
ఈడీ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి