Share News

ED found ₹331 Crores: బెట్టింగ్ యాప్ కేసు.. ఓ ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో రూ.331 కోట్లు..

ABN , Publish Date - Nov 29 , 2025 | 02:20 PM

పొట్ట కూటి కోసం ర్యాపిడో బైక్ తోలుకునే ఓ డ్రైవర్ ఖాతాలో రూ.331 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించింది ఈడీ. ఓ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో ఈ విషయం వెలుగుచూసింది.

ED found ₹331 Crores: బెట్టింగ్ యాప్ కేసు.. ఓ ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో రూ.331 కోట్లు..
Udaipur Wedding Funded Through Rapido Driver? Money Trail Reveals All

ఇంటర్నెట్ డెస్క్: బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్ కేసులో భారీ బాగోతం బయటపడింది. ఓ కేసు విచారణలో భాగంగా ఓ ర్యాపిడో బైక్ డ్రైవర్ బ్యాంక్ అకౌంట్లో రూ.331.36 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించారు ఎన్ఫోర్స్‌మెంట్(ఈడీ) అధికారులు. 1xBet సంస్థకు చెందిన ఆన్‌లైన్ బెట్టింగ్‌తో సంబంధమున్న కేసులో దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారుల విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.


ఏం జరిగిందంటే.?

పొట్ట కూటి కోసం ర్యాపిడో బైక్ నడిపే బైకర్ ఖాతాలో.. గతేడాది ఆగస్టు 19 నుంచి 2025 ఏప్రిల్ 16 వరకూ రూ.331.36 కోట్ల నగదు చేరిందని ఈడీ అధికారులు తెలిపారు. దీంతో ఆ డ్రైవర్ బ్యాంకు అకౌంట్లో పేర్కొన్న అడ్రస్ ఆధారంగా మరిన్ని వివరాలను ఆరాతీశారు అధికారులు. అతడు ఢిల్లీలోని ఓ స్లమ్ ఏరియాలో నివాసముంటున్నట్టు గుర్తించారు. అదే ఖాతా నుంచి గతేడాది నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన ఓ పెళ్లి ఖర్చులకుగానూ కోటి రూపాయల లావాదేవీలు జరిగినట్టు తేల్చారు. ఆ వివాహం.. గుజరాత్‌కు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడిదని తెలుస్తోంది.


అయితే.. తన బ్యాంకు ఖాతా ద్వారా జరిగిన ఈ లావాదేవీలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని సదరు ర్యాపిడో డ్రైవర్ వాపోయారని ఈడీ అధికారులు తెలిపారు. నిందితులు.. ఈ బైకర్‌ బ్యాంక్ అకౌంట్‌ను మ్యూల్ ఖాతాగా ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ చేసినట్టుగా ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ఆర్థిక నేరాలకు పాల్పడి.. అక్రమంగా సంపాదించిన భారీ మొత్తాలను కూడబెట్టేందుకే మరొకరి ఖాతాను మ్యూల్ అకౌంట్‌గా చేసి వాడుకుంటారు.


ఇవీ చదవండి:

‘దిత్వా’ ఎఫెక్ట్.. రెండు రోజుల భారీ వర్షసూచన

జెలెన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి తొలగింపు.. కారణమిదే.?

Updated Date - Nov 29 , 2025 | 02:30 PM