Share News

Anmol Bishnoi: గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ఎన్ఐఏ కస్టడీ డిసెంబర్ 5 వరకూ పొడిగింపు

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:26 PM

ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఇటీవల బిష్ణోయ్‌ను 11 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఎన్ఐఏ తరఫున అడ్వకేట్ కుష్‌దీప్ గౌర్‌తో కలిసి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి శనివారంనాడు విచారణ ముందుకు హాజరయ్యారు.

Anmol Bishnoi: గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ఎన్ఐఏ కస్టడీ డిసెంబర్ 5 వరకూ పొడిగింపు
Anmol Bishnoi

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) ఎన్ఐఏ (NIA) కస్టడీని మరో ఏడు రోజులు పొడిగించారు. భద్రతా కారణాల రీత్యా ఎన్ఐఏ న్యాయమూర్తి స్వయంగా ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి చేరుకుని అక్కడే ప్రత్యేక విచారణ జరిపారు. అన్మోల్‌పై ఉన్న పలు కేసుల్లో విచారణ కొనసాగుతున్నందున డిసెంబర్ 5వ తేదీ వరకూ ఎన్ఐఏ కస్టడీని పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.


ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఇటీవల బిష్ణోయ్‌ను 11 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఎన్ఐఏ తరఫున అడ్వకేట్ కుష్‌దీప్ గౌర్‌తో కలిసి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి శనివారంనాడు విచారణ ముందుకు హాజరయ్యారు. లారెన్స్ బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్‌లో అన్మోల్ కీలక సభ్యుడని, 2022 నుంచి పరారీలో ఉన్నాడని, ఈ టెర్రర్ గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌లో అరెస్టయిన 19వ నిందితుడని కోర్టుకు త్యాగి తెలిపారు.


అమెరికాలో పట్టుబడిన అన్మోల్ బిష్ణోయ్‌ను ఆ దేశం ఇటీవల బహిష్కరించింది. దీంతో నవంబర్ 19న అన్మోల్‌ను ఇండియాకు తరలించారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతన్ని లాంఛనంగా ఎన్ఐఏకి అప్పగించారు. అన్మోల్‌పై రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలలో 31 కేసులున్నాయి. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడే అన్మోల్. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్‌ జాబితాలో ఉన్న అతనిపై రూ.10 లక్షల రివార్డు కూడా ఉంది. అంతర్జాతీయ టెర్రరిస్టుగా ముద్రపడిన గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌కు సన్నిహితంగా అన్మోల్ పనిచేస్తూ విదేశాల నుంచి కీలకమైన ఆపరేషనల్ సపోర్ట్ అందించేవాడని ఎన్ఐఏ చెబుతోంది.


ఇవి కూడా చదవండి..

ఈడీ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు

డీకే, సీఎం సిద్ధరామయ్య టీపార్టీ మీటింగ్.. రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చ !

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2025 | 03:40 PM