ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు లభించిన వ్యవహారంపై పార్లమెంటరీ విచారణ కమిటీ కీలక విషయాలు వెల్లడించింది. ఆయన ఇంట్లో లభించిన నగదుకు సంబంధించి తగిన వివరణ ఇవ్వడంలో వర్మ విఫలమయ్యారని కమిటీ పేర్కొంది.
ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన ఓ విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు గంటల్లో ముగియాల్సిన ప్రయాణం.. తొమ్మిది గంటల సుదీర్ఘ నిరీక్షణగా మారి నరకాన్ని చూపించింది. ఊపిరాడక విమాన క్యాబిన్ 'గ్యాస్ ఛాంబర్'లా మారిందని ప్రయాణికులు వాపోయారు.
తరచుగా రాజకీయ విమర్శలు చేసుకునే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకులు సరదాగా మాట్లాడుకున్న అరుదైన దృశ్యం కనిపించింది.
నీట్ పరీక్ష వివాదం.. విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన ఒక అధికారిక లేఖ రాశారు.
పార్లమెంట్ సమావేశాలను వరుసగా అడ్డుకుంటూ, విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై అధికార భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రతిపక్షాల ఈ తరహా ధోరణి వారి 'అరాచక మనస్తత్వాన్ని' ప్రతిబింబిస్తోందని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు.
విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు-2026 విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లును ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించే ప్రతిపాదనను లోక్‌సభ ఆమోదించింది.
రాజ్యసభలో లుంగీవాలా వ్యాఖ్యలు కలకలానికి దారి తీశాయి. బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తనను లుంగీవాలా అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సీపీఐ (ఎమ్) ఎంపీ జాన్ బ్రిటాస్ ఆరోపించారు.
పార్లమెంట్‌లో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నారు.
టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఈ సంస్థ చైర్మన్ పదవిని తాను మరోసారి కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసును అమెరికా కోర్టు కొట్టివేయటంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.