అదానీకి అమెరికా కోర్టులో ఊరట.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం..
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:35 AM
ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసును అమెరికా కోర్టు కొట్టివేయటంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసును అమెరికా కోర్టు కొట్టివేయటంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అమెరికా కోర్టు గౌతమ్ అదానీపై కేసును కొట్టి వేయటం వెనుక.. పైకి కనిపిస్తున్న దానికంటే ఎక్కువ విషయమే ఉందని అన్నారు. ప్రధాన మంత్రి లొంగిపోయి.. భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘దీని వెనుక పైకి కనిపిస్తున్న దానికంటే చాలా ఎక్కువ విషయం ఉంది. ప్రధాన మంత్రి లోంగిపోయారు. భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. భారతదేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది’ అని రాసుకొచ్చారు.
‘విత్ ప్రిజుడిస్’తో కేసు కొట్టివేత..
గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలు సౌరవిద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు భారత్‌లో అధికారులకు దాదాపు రూ.2300 కోట్ల దాకా లంచాలు చెల్లించారంటూ 2024లో అమెరికాలో క్రిమినల్ అభియోగాలు దాఖలయ్యాయి. ఈ అభియోగాలను యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ ‘విత్ ప్రిజుడిస్’తో కొట్టివేశారు. ఇదే ఆరోపణలపై భవిష్యత్తులో అదానీపై అమెరికా ప్రభుత్వం మళ్లీ కేసు పెట్టడానికి వీల్లేకుండా శాశ్వతంగా తలుపులు మూసేశారు.
ఇవి కూడా చదవండి
పుష్కర లిఫ్ట్ స్కీం పైప్‌లైన్ పనులపై సమీక్ష.. ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి నిమ్మల ఆగ్రహం