ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం..
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:58 PM
విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు-2026 విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లును ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించే ప్రతిపాదనను లోక్‌సభ ఆమోదించింది.
విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు-2026 విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లును ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించే ప్రతిపాదనను లోక్‌సభ ఆమోదించింది. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది (FCRA Amendment Bill 2026).
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు–2026ను పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించే ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకొచ్చారు. ప్రతిపాదిత కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. ఇందులో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. కమిటీ తన నివేదికను 2026 శీతాకాల సమావేశాల తొలి వారంలో సమర్పించాల్సి ఉంటుంది (Foreign Contribution Regulation Act).
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి (Parliamentary Committee). బిల్లులోని కొన్ని నిబంధనలు విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థల కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లును పూర్తిగా పరిశీలించి, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని విపక్షాలు కోరుతున్నాయి. మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును రూపొందించారని అఖిలేష్ యాదవ్ విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్
ప్రయోగించిన 85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్..