Share News

ప్రయోగించిన 85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్..

ABN , Publish Date - Aug 11 , 2026 | 07:27 PM

చైనా అంతరిక్ష కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైనాన్‌ ప్రావిన్స్‌లోని వెంచాంగ్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్-7ఏ రాకెట్ కొద్దిసేపటికే గాల్లో పేలిపోయింది.

ప్రయోగించిన 85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్..
China rocket explosion

ఇంటర్నెట్ డెస్క్: చైనా అంతరిక్ష కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైనాన్‌ ప్రావిన్స్‌లోని వెంచాంగ్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోమవారం రాత్రి ప్రయోగించిన లాంగ్ మార్చ్-7ఏ రాకెట్ కొద్దిసేపటికే గాల్లో పేలిపోయింది. దీంతో కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చే ప్రయత్నం విఫలమైంది (China rocket explosion).


చైనా కాలమానం ప్రకారం ఆగస్టు 10వ తేదీ రాత్రి 8:02 గంటలకు లాంగ్ మార్చ్-7ఏ రాకెట్‌ వెంచాంగ్‌ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రయోగం జరిగిన సుమారు 85 సెకన్ల తర్వాత రాకెట్‌లో అసాధారణ పరిస్థితి ఏర్పడి అది గాల్లోనే విడిపోయి పేలిపోయింది. రాకెట్‌ అగ్నిగోళంగా మారిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి (Chinese rocket failure).


ఈ ప్రయోగంలో శాట్-4బీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది (Rocket explosion video). ఈ ఉపగ్రహాన్ని జోంగ్‌షింగ్‌-4బీ అని కూడా పిలుస్తారు. రాకెట్‌ వైఫల్యంతో ఉపగ్రహం కక్ష్యలోకి చేరలేకపోయింది. రాకెట్‌ ఎందుకు పేలిపోయిందనే దానిపై ప్రస్తుతం స్పష్టమైన సమాచారం లేదు. ఈ వైఫల్యానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభమైంది.


ఇవి కూడా చదవండి..

దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్‌ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..


అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..

Updated Date - Aug 11 , 2026 | 07:29 PM