Share News

వందేమాతరం కూడా ఇక జనగణమనతో సమానం.. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

ABN , Publish Date - Aug 11 , 2026 | 07:14 PM

భారత జాతీయ గీతం 'జన గణ మన' తరహాలోనే 'వందేమాతరం'కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు.

వందేమాతరం కూడా ఇక జనగణమనతో సమానం.. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
Vande Mataram Bill 2026

ఇంటర్నెట్ డెస్క్: భారత జాతీయ గీతం 'జన గణ మన' తరహాలోనే 'వందేమాతరం'కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది (Vande Mataram Bill 2026).


1971 నాటి బిల్లులోని సెక్షన్‌ 3ను సవరించడం ద్వారా 'వందేమాతరం'ను కూడా చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. జాతీయ గీతాన్ని అడ్డుకోవడం లేదా దాని గౌరవాన్ని భంగపరిచేలా వ్యవహరించడంపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఉంటుంది. అయితే అదే స్థాయిలో వందేమాతరానికి ఇప్పటివరకు ప్రత్యేక రక్షణ లేదు. తాజా సవరణ వందేమాతరానికి కూడా చట్ట పరమైన రక్షణ కల్పించింది (Vande Mataram legal protection).


కొత్త చట్టం ప్రకారం 'వందేమాతరం' గానం జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా ఆ గానం చేస్తున్న సమూహానికి అంతరాయం కలిగించడం శిక్షార్హమైన నేరం (Vande Mataram Act). దీనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే సవరణ బిల్లును పార్లమెంట్ గత నెలలో ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో బిల్లు ఇప్పుడు అధికారిక చట్టంగా అమల్లోకి వచ్చింది.


ఇవి కూడా చదవండి..

దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్‌ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..


అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..

Updated Date - Aug 11 , 2026 | 07:20 PM