అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..
ABN , Publish Date - Aug 11 , 2026 | 02:51 PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి దశలో అధికార, విపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మంగళవారం పార్లమెంట్ ద్వారం వద్ద విపక్ష ఎంపీలు నిరసనలు చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి దశలో అధికార, విపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మంగళవారం పార్లమెంట్ ద్వారం వద్ద విపక్ష ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోమవారం హామీ ఇచ్చారు (Amit Shah Parliament Protest).
విద్యార్థుల ఆందోళనపై జరిగే చర్చకు హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తారని, అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వ సమాధానాన్ని శాంతియుతంగా వినవలసి ఉంటుందని రిజిజు అన్నారు. కాగా, జార్ఖండ్‌లో ఉద్యోగార్థులపై పోలీసుల చర్య, అయోధ్య రామమందిర విరాళాల అపహరణకు నిరసనగా అధికార, విపక్ష ఎంపీలు నిరసనలు చేపట్టారు. మంగళవారం పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఎన్డీయే, విపక్ష ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేశారు (Amit Shah, Parliament Monsoon Session).
జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలపై చర్చ నుంచి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పారిపోతున్నారని ఎన్డీయే ఎంపీలు ఆరోపించారు (Jharkhand Student Protest). ఢిల్లీలో జులై 20న జరిగిన నిరసనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబుదారీతనం వహించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. కాగా, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో సభను బుధవారానికి వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకాశ్ రాజ్
ఝార్ఖండ్ విద్యార్థుల నిరసన.. తమ చర్యలను సమర్థించుకున్న పోలీసులు