Share News

ఝార్ఖండ్ విద్యార్థుల నిరసన.. తమ చర్యలను సమర్థించుకున్న పోలీసులు

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:56 PM

రాంచీలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీకి అడ్డంకులు సృష్టించిన వారి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఝార్ఖండ్ విద్యార్థుల నిరసన.. తమ చర్యలను సమర్థించుకున్న పోలీసులు
Jharkhand Student Protests

ఇంటర్నెట్ డెస్క్: రాంచీలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీకి అడ్డంకులు సృష్టించిన వారి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే, అసెంబ్లీ వైపు పెద్ద సంఖ్యలో వస్తున్న విద్యార్థులను అదుపు చేసేందుకు పరిమితస్థాయిలో బలప్రయోగాన్ని రాష్ట్ర పోలీసు వర్గాలు సమర్థించుకున్నాయి.

ర్యాలీ సందర్భంగా పోలీసులు వాటర్ క్యానన్‌, భాష్పవాయువును ప్రయోగించారు. లాఠీ చార్జ్ కూడా జరిగింది. రోడ్డు క్లియర్ చేయాలని పదే పదే అభ్యర్థించినా నిరసన కారులు పట్టించుకోలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. కొందరు బ్యారికేడ్లను ధ్వంసం చేశారని, వాహనాలను అడ్డుకున్నారని ఆరోపించాయి. మరోవైపు, ఎలాంటి హెచ్చరికలు లేకుండానే పోలీసులు బలప్రయోగానికి దిగారని విద్యార్థులు ఆరోపించారు. లాఠీ చార్జ్ సందర్భంగా కనీసం 100 మందికిపైగా విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఓ యువకుడు ఆరోపించారు.


పరస్పర ఆరోపణల నేపథ్యంలో ర్యాలీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అడ్డంకులు సృష్టించిన వారు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం నాటి నిరసనల్లో 14 మంది పోలీసులకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఒకరికి తీవ్ర గాయమైందని అన్నారు. అయితే, పరిస్థితిని అదుపు చేసేందుకు వీలైనంత పరిమితిస్థాయిలోనే బలప్రయోగం చేశామని రాంచీ ఎస్ఎస్‌పీ రాకేశ్ రంజన్ చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

అసెంబ్లీలో ఆ తీర్మానానికి ఆమోదం.. సీఎం విజయ్‌పై కమల్ ప్రశంసలు..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర మరువదు: సోనియా గాంధీ

Updated Date - Aug 11 , 2026 | 02:05 PM