Share News

ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకాశ్ రాజ్

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:11 PM

కర్ణాటకలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కమిషన్ తన ఓటును తొలగించటంపై బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. తను పుట్టి, పెరిగిన ప్రాంతం నుంచి ఓటును తొలగించటం ఓ పెద్ద జోక్ అని ఆయన అన్నారు.

ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకాశ్ రాజ్
Prakash Raj

బెంగళూరు, ఆగస్టు 11: కర్ణాటకలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కమిషన్ తన ఓటును తొలగించటంపై బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. తను పుట్టి, పెరిగిన ప్రాంతం నుంచి ఓటును తొలగించటం ఓ పెద్ద జోక్ అని ఆయన అన్నారు. ఓటును ఎలాగైనా తిరిగి పొందుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.


ఆ పోస్టులో.. ‘కర్ణాటకలో జరుగుతున్న SIR ప్రక్రియలో భాగంగా బెంగళూరు నియోజకవర్గం నుంచి నా ఓటును తొలగించారు. ఇది నాకు ఓ పెద్ద 'జోక్' లాగా అనిపించింది. నాతో పాటు దాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇలాగే తొలగించారు. నేను ఇదే బెంగళూరు నియోజకవర్గంలో పుట్టి, పెరిగాను. నా స్కూలింగ్, కాలేజీ, థియేటర్ అన్నీ ఇక్కడే జరిగాయి. అంతెందుకు.. గతంలో నేను ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశాను’..


‘అలాంటిది నా ఓటునే ఎలా తొలగిస్తారు?. ఓటును తిరిగి తెచ్చుకోవడానికి ఇప్పుడు నేను మళ్లీ ఏమేం కాగితాలు చూపించాల్సి వస్తుందో. నా మిత్రమా.. మిమ్మల్ని ఎన్నుకోరని భావించే కొందరు పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి మీరు మీ అధికారాన్ని ఉపయోగించవచ్చు. కానీ, మిమ్మల్ని ఆ సింహాసనం నుంచి కిందకు దించే మా ప్రజల శక్తిని మీరు ఆపగలరా?. జస్ట్ ఆస్కింగ్’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

తమిళనాడులో కొత్త వివాదం! అబార్షన్ వ్యతిరేక ర్యాలీలో అసెంబ్లీ స్పీకర్

రైలు పట్టాలపై ఆగిన లారీ.. ఇంతలో గ్రీన్ సిగ్నల్.. చివరకు..

Updated Date - Aug 11 , 2026 | 01:23 PM