Share News

రైలు పట్టాలపై ఆగిన లారీ.. ఇంతలో గ్రీన్ సిగ్నల్.. చివరకు..

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:32 PM

రైల్వే ట్రాక్‌పై వాహనం ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. టెన్షన్ టెన్షన్‌గా ఉంటుంది. రైలు.. ఎటు వైపు నుంచి దూసుకొస్తుందో తెలియదు. దీంతో పై ప్రాణాలు పైనే పోయినట్లు పరిస్థితి అవుతుంది. దాదాపు ఇదే పరిస్థితి ఆ లారీ డ్రైవర్‌కు కలిగింది.

రైలు పట్టాలపై ఆగిన లారీ.. ఇంతలో గ్రీన్ సిగ్నల్.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: రైల్వే ట్రాక్‌పై వాహనం ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. టెన్షన్ టెన్షన్‌గా ఉంటుంది. రైలు.. ఎటు వైపు నుంచి దూసుకొస్తుందో తెలియదు. దీంతో పై ప్రాణాలు పైనే పోయినట్లు పరిస్థితి అవుతుంది. దాదాపు ఇదే పరిస్థితి ఆ లారీ డ్రైవర్‌కు కలిగింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో భారీ లోడ్‌తో వెళ్తున్న లారీ సరిగ్గా రైల్వే క్రాసింగ్‌పై ఆగిపోయింది. ఆ వాహనం ముందుకు.. వెనక్కి కదల లేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ట్రాక్‌పైకి అటు ఇటు రైళ్లు వస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్స్ పడ్డాయి. దీంతో రైలు గేటు వేద్దామంటే.. ట్రాక్‌పై భారీ వాహనం నిలిచిపోయింది. దాంతో రైల్ గేట్ కీపర్‌తోపాటు అక్కడ ఉన్నవారందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది.


కానీ ఇంతలో క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (క్యూఆర్ఎఫ్) బృందం వాహనం అక్కడకు వచ్చి ఆగింది. స్థానికంగా నెలకొన్న పరిస్థితిని ఆ బృందం అంచనా వేసింది. పోలీసులు, స్థానికుల సహాయంలో క్యూఆర్ఎఫ్ బృందం లారీని వెనక్కి తోసింది. అనంతరం రైలు గేట్ వేశాడు కీపర్. ఆ తర్వాత గూడ్స్ రైలు ట్రాక్‌పై వెళ్లిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పోలీసుల కాళ్లకు అతడు నమస్కరించాడు.


ఈ మొత్తం వీడియోలో నిక్షిప్తమైంది. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం దామోహ్‌కు ఈ క్యూఆర్ఎఫ్ బృందం వెళ్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి.. లైకులు కొట్టారు. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. క్యూఆర్ఎఫ్ బృందం దేవుడిలా వచ్చిందని పేర్కొంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. లారీ డ్రైవర్ స్పందించిన తీరు సూపర్‌గా ఉందని చెబుతున్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:41 PM