Share News

హోర్ముజ్ మా సొంతం.. దగ్గరకొస్తే పేల్చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:09 PM

హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు.

హోర్ముజ్ మా సొంతం.. దగ్గరకొస్తే పేల్చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
Donald Trump Comments on Hormuz Strait

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. ‘నేను ఇరాన్‌ను విశ్వసించను. వాళ్లు నిత్యం నాతో అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ప్రస్తుతం హోర్ముజ్‌పై మాకు పూర్తి నియంత్రణ ఉంది. వాళ్లకు హోర్ముజ్‌పై కంట్రోల్ లేదు. అది మా సొంతం. వాళ్లు ఈ విషయంలో ఏదోకటి చేసేందుకు ప్రయత్నించి చివరకు తుత్తునియలు అవుతారు’ అని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా పటిష్ఠ స్థితిలో ఉందని కూడా చెప్పారు. ‘పశ్చిమాసియాలో ఇరుగుపొరుగును ఓ దేశం గత 50 ఏళ్లుగా బెదిరిస్తోంది. ఆ బెదిరింపులకు ఇక కాలం చెల్లిపోయింది’ అని ట్రంప్ అన్నారు.


మరోవైపు, అమెరికా అన్యాయంగా, అవమానకరంగా తమపై ఆంక్షలు విధిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ప్రస్తుతం హోర్ముజ్‌లో పరిస్థితులకు అమెరికా, ఇజ్రాయెల్ కారణం. ఇప్పటికీ వారి దాడులు కొనసాగుతున్నాయి’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. ఇదిలా ఉంటే, హోర్ముజ్‌లో భద్రంగా రవాణా కొనసాగించే దిశగా ఇరాన్, ఒమాన్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

ప్రయోగించిన 85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్..

Updated Date - Aug 12 , 2026 | 12:30 PM