అశ్వారావు పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన చాలా వినూత్నంగా ప్రచారం చేశారు. చికెట్ కొట్టి, పాడ పాడారు.
బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ బీఆర్‌ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్‌ఎస్ మోసం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి.
తొలి విడత పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాల్లో అందరి దృష్టి ప్రధానంగా వైశాలి జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంది. ఇక్కడి నుంచి ఆర్జేడీ నుంచి 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు.
కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ బంధువు అయిన జ్యోతి మాంఝీ ఓపెన్ జీప్‌లో సిల్‌బట్టా ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొందరు ఆమెపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఒక రాయి ఆమెకు తగలడంలో గాయపడ్డారు.
తేజ్ ప్రతాప్ యాదవ్‌పై ఆర్జేడీ ఇటీవల బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆయన కొత్తగా 'జన్‌శక్తి జనతా దళ్' పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆపార్టీ 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.
సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరిగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిటీలో మళ్లీ తాగునీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్‌నేనని విమర్శించారు. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని నొక్కిచెప్పారు కేటీఆర్.
బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి మాజీ సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి .
జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏబీఎన్‌తో మాట్లాడారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని..
మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ తగిలింది. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కేటీఆర్ ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఓ ఓటరు ఫిర్యాదు చేశారు.