Share News

Jubilee Hills by Elections: బస్తీలే టార్గెట్‌‌గా నాయకుల ప్రచారం.. ప్రాంతాల వారీగా..

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:47 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు..

Jubilee Hills by Elections: బస్తీలే టార్గెట్‌‌గా నాయకుల ప్రచారం.. ప్రాంతాల వారీగా..

పార్టీ మారాలంటూ వినతులు

చోటామోటా లీడర్లకు ప్రలోభాలు

పలు ప్రాంతాల్లో జోరుగా చేరికలు

బస్తీలే టార్గెట్‌గా అభ్యర్థుల ఎత్తుగడలు


హైదరాబాద్ సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఓట్లు ఎక్కువగా పోలయ్యే ప్రాంతాల్లో బలమైన లీడర్ల దగ్గర నుంచి చోటా మోటా నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు బేరసారాలకు దిగుతున్నారు.


ప్రాంతాల వారీగా ప్రణాళికలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే ప్రాంతాల్లో పోలైన ఓట్లలో తక్కువ వచ్చాయో గుర్తించి ఆ బూత్లలో ఓట్లు పెంచుకోవడానికి అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓట్లను గంపగుత్తగా వేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆ బస్తీల్లో కానీ, వీధిలో కానీ బలమైన వ్యక్తులను, లీడర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పార్టీ మారాలని, ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వ్యక్తిగత, వ్యాపార సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీనిస్తున్నారు. అవసరమైతే పార్టీ మారే వ్యక్తికి ఉన్న ప్రాబల్యం ఆధారంగా రూ.లక్షల్లో చెల్లింపులు. చేస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారు. దాంతో రాత్రికి రాత్రి డివిజన్లు, బస్తీలలో పెద్దఎత్తున పార్టీలు మారుతున్నారు. తనతో పాటు పార్టీ మారే వ్యక్తులకు రూ.500 నుంచి రూ.2వేల వరకు చెల్లిస్తున్నారు.


ప్రధాన పార్టీలకు సవాలే..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు ఇతర పార్టీల్లో ప్రాబల్యం కలిగిన వారై అసంతృప్తతో ఉంటే చాలు. రాత్రికి రాత్రి చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాన పార్టీ నేత రోడ్డు షోలో ఓ సీనియర్ లీడర్ అసంతృప్తికి గురైనట్లుగా తెలుసుకున్న ప్రత్యర్థి పార్టీ నేతలు సంప్రదింపులు చేసినట్లు తెలిసింది. ఈ సంద ర్భంలో పార్టీ మారేందుకు ఆఫర్లు కూడా ఇవ్వడంతో ఆ నేత మరుసటి రోజు పార్టీ మారాడు. ఈ తరహా సమీకరణాలు ప్రధాన పార్టీలకు సవాలుగా మారాయి.


ఇవి కూడా చదవండి:

Investigation of defecting MLAs: ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్

Updated Date - Nov 07 , 2025 | 01:57 PM