ఏఐ జమానాలో కంప్యూటర్ సైన్స్, ఐటీ డిగ్రీ పట్టాలు ఉన్న వారికి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఇండియా స్కిల్స్ రిపోర్టు తేల్చింది. ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎంబీఏ కాస్త వెనుకబడగా కామర్స్ గణనీయంగా మెరుగైనట్టు కూడా నివేదికలో తేలింది.
ఈ ఏఐ జమానాలో అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకోవడం ఎలా అనేది యువతను వేధిస్తున్న ప్రశ్న. అయితే, అమెజాన్ ఉద్యోగుల నుంచి తాను ఆశించేది ఏమిటో సంస్థ అధినేత జెఫ్ బెజోస్ చాలా కాలం క్రితమే స్పష్టంగా తెలియజేశారు. ఆయన మాటలనే యువత ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు.
దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్‌టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జేఎన్‌టీయూలో జరిగిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(MCC) నీట్ పీజీ రౌండ్ 1 కౌన్సిలింగ్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. కౌన్సిలింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను..
ప్రఖ్యాత ఇంగ్లీష్ నిఘంటువు సంస్థలు ఏడాదికోసారి 'వర్డ్ ఆఫ్ ద ఇయర్'ను విడుదల చేస్తుంటాయి. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, కొలిన్స్ లాంటి డిక్షనరీలు ఇందులో బాగా ప్రాచుర్యం పొందాయి. అలా కేంబ్రిడ్జ్ విడుదల చేసిన తాజా జాబితాలో ఈ ఏడాదికి గానూ 'పారాసోషల్' అనే పదం నిలిచింది. ఈ పదం అర్థం ఏంటి? ఎందుకు ఈ పదం ఇయర్ ఆఫ్ ద వర్డ్‌గా ఎన్నికైందో? ఆ వివరాలు మీకోసం...
ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ సంబంధిత రివైజ్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల అయింది. తొలుత ఈ పరీక్షలు నవంబర్ 17 నుంచి ప్రారంభం కావాల్సిఉండగా.. నియామక ప్రక్రియకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా వాయిదాపడింది.
గమ్మత్తేమిటంటే... ఈ 60 ఏళ్ల మాస్టర్‌గారు 1981లో బొటాబొటి మార్కులతో తొలిసారి డిగ్రీ పాసయ్యారు. ఆ మార్కులు చూసి అతడి తల్లి చాలా బాధపడిందట. దాంతో ‘టాప్ మార్కులు తెచ్చుకుంటాన’ని ఆమెకు వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి ఇష్టంతో చదవడం మొదలెట్టాడు.
ప్రైవేటు కాలేజీల్లోని రీసెర్చ్ కేంద్రాల్లో పరిశోధనలకు అనుమతిస్తున్నట్లు జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ టి.కిషన్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ఆచార్యులతో వీసీ మాట్లాడారు.
జేఎన్‌టీయూలో బోధనేతర (నాన్‌టీచింగ్) పోస్టుల్లో సుమారు 40 మంది ప్రొఫెసర్లు పని చేస్తుండడాన్ని జేఎన్టీయూహెచ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
జిల్లాలో కొన్ని కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులో చేరితే తరగతికి హాజరుకానవసరం లేదు. పైగా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజం. వృత్తి విద్యా శాఖ నుంచే ఆయా కళాశాలలకు పరోక్ష సహకారం అందుతున్నట్లు ఆరో పణలు ఉన్నాయి.