Share News

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ర్యాంక్‌ ఇంప్రూవ్‌మెంట్‌కు చెక్‌!

ABN , Publish Date - Feb 09 , 2026 | 03:08 AM

దేశంలోనే అత్యున్నత పోటీ పరీక్షగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే పలు కొత్త నిబంధనలు ఈ సారి చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ర్యాంక్‌ను మెరుగుపర్చుకునే చర్యలకు యూపీఎస్సీ చెక్‌ పెట్టింది. అదే సమయంలో పలు నిబంధనలను కూడా చేర్చింది. అవేంటో పరిశీలిద్దాం.

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ర్యాంక్‌ ఇంప్రూవ్‌మెంట్‌కు చెక్‌!

దేశంలోనే అత్యున్నత పోటీ పరీక్షగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే పలు కొత్త నిబంధనలు ఈ సారి చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ర్యాంక్‌ను మెరుగుపర్చుకునే చర్యలకు యూపీఎస్సీ చెక్‌ పెట్టింది. అదే సమయంలో పలు నిబంధనలను కూడా చేర్చింది. అవేంటో పరిశీలిద్దాం.

సివిల్‌ సర్వీసె్‌సలో ఇప్పటికే కొనసాగుతున్న అధికారుల విషయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కఠినమైన వైఖరిని యూపీఎస్సీ అవలంభించింది. సర్వీ్‌సలో ఉంటూ, మరింత మెరుగైన ర్యాంక్‌ లేదా నచ్చిన కేడర్‌ కోసం మళ్ళీ రాసే అభ్యర్థుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. దీంతో కొత్త అభ్యర్థులకు అవకాశాలు తగ్గుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా..

  • గత పరీక్షల్లో ఐఏఎస్‌, ఐఎ్‌ఫఎ్‌స(ఫారిన్‌ సర్వీ్‌స)కు ఎంపికై శిక్షణలో ఉన్న, విధుల్లో చేరిన అభ్యర్థులు ఈసారి(2026 సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌) రాసేందుకు అనర్హులు. ఒక వేళ రాయాలనుకుంటే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగానికి మొదట రాజీనామా చేయాలి. ఆ రాజీనామా ఆమోదం పొందితేనే పరీక్ష రాసేందుకు అర్హులు అవుతారు.

  • కేంద్ర గ్రూప్‌-ఎ(ఐఆర్‌ఎస్‌, ఐఆర్‌టీఎస్‌ తదితరాలు) సర్వీసుల్లో కొనసాగుతున్న వ్యక్తులు మెరుగైన ర్యాంక్‌ కోసం సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ రాయవచ్చు.

  • 2026 ఎగ్జామ్‌లో ఎంపికైనప్పటికీ 2027లో రాయాలనుకుంటే శిక్షణ నుంచి మినహాయింపు తీసుకోవాలి.

  • 2027లో మినహాయింపు తీసుకుని మళ్ళీ 2028లో రాయాలనుకుంటే ఉద్యోగానికి తప్పనిసరిగా రాజీనామా చేయాలి. ఉద్యోగం వదులుకో లేదంటే సంతృప్తిపడు అనే నిబంధన వర్తిస్తుందని అభ్యర్థులు గ్రహించాలి.


క్యాడర్‌ అలొకేషన్‌ పాలసీ(క్యాప్‌)

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌ విషయంలో క్యాడర్‌ అలొకేషన్‌ పాలసీ(క్యాప్‌) 2026ని ప్రకటించింది. ఇది పాత జోనల్‌ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ మొదటి గ్రూప్‌లోకి, తెలంగాణ నాలుగో గ్రూపులోకి వచ్చాయి. ఈ ఎగ్జామ్‌ పరిధిలోని 26 క్యాడర్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.

  • మొదటి గ్రూపులో ఆంధ్రప్రదేశ్‌, ఏజీఎంయుటి(ఢిల్లీ, అరుణాచల్‌ గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాలు) అసోం-మేఘాలయ, బిహార్‌, చత్తీ్‌సగఢ్‌; రెండో గ్రూపులో గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌; మూడో గ్రూపులో మహారాష్ట్ర, మణిపూర్‌, నాగాలాండ్‌, ఒడిషా, పంజాబ్‌, రాజస్థాన్‌, సిక్కిం, తమిళనాడు; నాలుగో గ్రూపులో తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి.

  • ఏపీ అభ్యర్థికి టాప్‌ ర్యాంక్‌ వచ్చి ఇన్‌సైడర్‌(సొంత రాష్ట్ర) కోటా దక్కకుంటే పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. గ్రూప్‌ 2, 3, 4 ుల్లో ఒక్కో రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. మొదటి గ్రూపులో ఏపీ కాకుంటే బీహార్‌ లేదా చత్తీ్‌సగడ్‌ రావడానికి అవకాశాలు ఎక్కువ.

  • తెలంగాణ ఉన్న నాలుగో గ్రూపులో త్రిపుర, బెంగాల్‌, యూపీ ఇతర రాష్ట్రాలు. భౌగోళికంగా, సాంస్కృతికంగా ఆ రాష్ట్రాలు తెలంగాణకు చాలా దూరం. వీరికి సైతం ఇతర గ్రూపులతోనూ ఇదేరకమైన ఇబ్బంది ఉంటుంది.

  • రొటేషన్‌ పద్ధతిలో ఔట్‌సైడర్‌ను నింపేటప్పుడు గ్రూపులను రొటేట్‌ చేస్తారు. 2026లో గ్రూప్‌ 1తో మొదలుపెడతారు. 2027లో గ్రూపు 2 రాష్ట్రాలతో ఉంటుంది. తెలంగాణ అభ్యర్థికి సొంత రాష్ట్రం రాకుంటే మొదటి గ్రూపులోని ఏపీ లేదంటే రెండో గ్రూపులోని కర్ణాటక రావాలంటే ఆ ఏడాది రోస్టర్‌ ఆ గ్రూపులకు అనుకూలంగా ఉండాలి. లేదంటే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాల్సిందే.


ఏఐ కెమెరా స్కాన్‌

  • మాల్‌ప్రాక్టీ్‌సను నివారిచేందుకు యూపీఎస్సీ ఇకపై టెక్నాలజీని నమ్ముకుంటోంది. పరీక్ష కేంద్రలోకి ప్రవేశించే ప్రతి అభ్యర్థి ముఖాన్ని ఏఐ కెమెరా స్కాన్‌ చేస్తుంది. దరఖాస్తులో అప్‌లోడ్‌ చేసిన ఫోటోతో సరిపోలితేనే లోపలికి అనుమతి ఉంటుంది. మాస్కులు, గడ్డాలు, మేక్‌పల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రతగా ఉండాలి.

  • మూడు దశల సంతక విధానం అంటే ఒకదాని కింద మరొకటి నిలువుగా పెట్టాలి. అందుకు నిర్దేశిత కొలతలను కూడా సూచించింది. అభ్యర్థి చేతి రాతలోని నేచురల్‌ వేరియేషన్‌ను పట్టుకునేందుకు వీలుగా దీన్ని డిజైన్‌ చేశారు.

ప్రతిభాసేతు పోర్టల్‌

  • ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సివిల్స్‌లో ర్యాంక్‌ కోల్పోయిన అభ్యర్థుల కోసం ప్రతిభాసేతు పోర్టల్‌ను బలోపేతం చేసింది. దరఖాస్తులోనే ఎస్‌ అని టిక్‌ చేస్తే సదరు అభ్యర్థులతో డేటా బేస్‌ను ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు అందుబాటులో ఉంచుతుంది. వీరికి మళ్ళీ రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా గ్రూప్‌ బి స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి.

దరఖాస్తు రిజిస్ట్రేషన్‌లో మార్పు

  • దరఖాస్తు - రిజిస్ట్రేషన్‌ కోసం ఈ ఏడాది యూనివర్సల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌(యూఆర్‌ఎన్‌) విధానాన్ని అమలుచేస్తోంది. దీని ప్రకారం ఖాతా సృష్టి - యూఆర్‌ఎన్‌ - కామన్‌ అప్లికేషన్‌ ఫారం - పరీక్షకు ప్రత్యేక మాడ్యూల్‌ ఉంటాయి. ఒకసారి ఫారం సమర్పిస్తే ఎలాంటి మార్పులను అనుమతించరు. సీఏఎ్‌ఫను నింపేటప్పుడు లైవ్‌ ఫొటో తప్పనిసరి. మొత్తమ్మీద దరఖాస్తులో మార్పులకు ఎలాంటి అవకాశం లేకుండా చేసింది.


ఎగ్జామ్‌

  • పరీక్షలో తొలి అంకం ప్రిలిమినరీ. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్‌ స్డడీస్‌, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(సీశాట్‌) ఉంటాయి. రెండూ చెరి రెండు గంటల వ్యవధి కలిగిన పేపర్లు. సీశాట్‌ కేవలం అర్హత పేపర్‌ అంటే ఇందులో 33 శాతం మార్కులు తెచ్చుకుంటే చాలు. మెయిన్స్‌కు అర్హుల ఎంపిక జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఉంటుంది.

  • మెయిన్స్‌లోనూ చెరి 300 మార్కులకు భారతీయ భాష, ఆంగ్ల భాష పేపర్లు కేవలం అర్హత కోసం ఉంటాయి. మెరిట్‌ కోసం ఏడు పేపర్లు నిర్దేశించారు. ఒక్కో పేపర్‌కు కేటాయించిన మార్కులు 250. ఒక వ్యాసం, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు. రెండు ఆప్షనల్‌ సబ్జెక్టు పేపర్లు ఉంటాయి. మొత్తం 1750 మార్కులకుగాను మెరిట్‌ను బట్టి ఇంటర్వ్యూకు అభ్యర్థులను నిర్ణయిస్తారు. చివరగా పర్సనాలిటీ టెస్ట్‌ 275 మార్కులకు ఉంటుంది. మొత్తం మెయిన్స్‌ ప్లస్‌ పర్సనాలిటీ టెస్ట్‌ అంటే 2025 మార్కులకుగాను మెరిట్‌ లిస్ట్‌ రూపొందించి అభ్యర్థులను వివిధ సర్వీసులకు ఎంపిక చేస్తారు.

ఎం. బాలలత, సివిల్స్‌ మెంటార్‌

నోటిఫికేషన్‌

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ కింద 933 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 80 పోస్టులతో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌కు కూడా ప్రకటన జారీ అయింది. ఈ రెంటికి ప్రిలిమినరీ ఒకటే. మెయిన్స్‌, పర్సనాలిటీ టెస్టులు వేర్వేరు. ప్రిలిమినరీ పరీక్షను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మే 24న నిర్వహిస్తున్నారు. ఈ రెండు పరీక్షలకు వేర్వేరుగా ఫిబ్రవరి 24న సాయింత్రం ఆరుగంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్న రెండు నోటిఫికేషన్లను చూడవచ్చు.

వెబ్‌సైట్‌: /https://upsconl-ine.nic.in/

Updated Date - Feb 09 , 2026 | 03:08 AM