సీఎంఏ ఫైనల్, ఇంటర్‌లో మాస్టర్ మైండ్స్ హవా
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:40 AM
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విడుదల చేసిన సీఎంఏ ఫైనల్, ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని...
గుంటూరు(విద్య) ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విడుదల చేసిన సీఎంఏ ఫైనల్, ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎంఏ ఫైనల్‌లో మొదటి 50 ర్యాంకుల్లో చందు రవితేజ 16వ ర్యాంక్, కొల్లి దుంటి సాయి 17వ ర్యాంక్, తొలిచూరి అశోక్ కుమార్ 30వ ర్యాంక్, ఇలుమలై జిఎస్ 31వ ర్యాంక్, యశ్వంత్ జాగర్లమూడి 40వ ర్యాంక్ సాధించారని వివరించారు. అదే విధంగా సీఎంఏ ఇంటర్‌లో 5, 13, 21, 22, 25, 27, 28, 32, 35, 37, 39, 41, 42, 46, 47, 48, 49 ర్యాంకులను మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తదితరులు అభినందించారు.