షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఐపీవోల్లో పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి నుంచి సైబర్ మోసగాళ్లు రూ.8.40 లక్షలు కొట్టేశారు.
హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉండి, 35 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రౌడీషీటర్‌ను చార్మినార్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని బ్లూ కలర్ డ్రమ్‌లో దాచిపెట్టిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను మీరట్ జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి తనను పబ్‌కు తీసుకెళ్లి భారీగా బిల్లు వసూలు చేసేందుకు ప్రయత్నించిందంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
షేర్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయంటూ నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సైబర్ నేరగాళ్లు ఇద్దరిని బురిడీ కొట్టించారు.
ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ ఇలా.. ఏదేని సోషల్ మీడియా ద్వారా సైబర్ కేటుగాళ్లు తీయని మాటలతో అమాయకులను వలలో వేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన వరుస హత్యల ఘటన విషాదాంతమైంది. భార్యతో పాటు ఇద్దరు పూజారులను హత్య చేసిన, తన ముగ్గురు పిల్లలను గదిలో బంధించిన వ్యక్తి ఎన్కౌంటర్లో మరణించాడు.
యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను ఆమె బాయ్‌ఫ్రెండ్ కారుతో ఢీకొట్టి, బానెట్‌పై ఆమె ఉన్నా లెక్క చేయక వాహనాన్ని తోలాడు.
సైబర్ నేరగాళ్లు ఒకేరోజు మూడు వేర్వేరు కేసుల్లో రూ.లక్షలు దోచుకున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓ లాభాల పేరుతో రూ.35 లక్షల వరకు దోచేశారు.
ముఖానికి మాస్క్‌తో ఎలాంటి క్లూ చిక్కకుండా వ్యాపారి ఇంట్లో బంగారు, వజ్రాభరణాలు చోరీ చేసిన ఓ దొంగకు సంబంధించిన కేసును జూబ్లీహిల్స్ పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు.