మూడేళ్ల బాలికపై లైంగిక దాడి
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:04 AM
విశాఖపట్నంలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికిపాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...
బిస్కెట్లు ఆశ చూపి 17 ఏళ్ల బాలుడి అఘాయిత్యం
విశాఖలో దారుణం.. పోలీసుల అదుపులో నిందితుడు
విశాఖపట్నం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికిపాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిని అదుపులోకి తీసుకుని జువెనైల్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూపోర్టు పోలీ్‌సస్టేషన్ పరిధిలోని గంగవరం ప్రాంతంలో మూడేళ్ల బాలికను ఓ బాలుడు (17 సంవత్సరాల 11 నెలల 11 రోజులు) బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బిస్కెట్లు కొనిస్తానని చెప్పి... తనతోతీసుకువెళ్లాడు. 5 గంటలకు బాలికను తీసుకువచ్చి, ఇంటి వద్ద వదిలిపెట్టి పరారైపోయాడు. బాలిక ఏడుస్తుండడంతో ఆమె కుటుంబసభ్యులు ఏం జరిగిందని ఆరా తీశారు. బాలికకు రక్తస్రావం కావడంతో పాటు మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉండడంతో లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హార్బర్ ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది సాక్ష్యాలు సేకరించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కేజీహెచ్‌కు తరలించారు. బాధిత బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ప్రకారం నిందితుడిని గంగవరం ఆటోస్టాండ్ వద్ద గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అతడు నేరం అంగీకరించాడు. నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 5 (ఎం) రెడ్‌విత్ 6, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, జువెనైల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.