ఆగని మిరప చోరీలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:54 PM
విడపనకల్లు మండలంలోని పాల్తూరు గ్రామంలో మిరపకాయల చోరీలు ఆగడం లేదు. గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వెనుక వైపు ఉన్న రైతు అంగడి శివయ్య పొలంలో మిరపకాయల రాశిని బుధవారం రాత్రి నీటితో తడిపి సంచులకు నింపేందుకు ఏర్పాట్లు చేశాడు.
నాలుగు సంచులకు నింపుకుని పరారీ
పాల్తూరులో మరో రెండుచోట్ల యత్నం
విడపనకల్లు(అనంతపురం): విడపనకల్లు మండలంలోని పాల్తూరు గ్రామంలో మిరపకాయల చోరీలు ఆగడం లేదు. గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వెనుక వైపు ఉన్న రైతు అంగడి శివయ్య పొలంలో మిరపకాయల రాశిని బుధవారం రాత్రి నీటితో తడిపి సంచులకు నింపేందుకు ఏర్పాట్లు చేశాడు. ఓ గంట ఆగి కాయలను సంచులకు నింపి మార్కెట్‌కు తరలించాలి. హమాలీలు రావటం ఆలస్యం కావటంతో భోజనానికి ఇంటి వెళ్లాడు. మిరపరాశి వద్ద ఎవరూ లేని విషయాన్ని పసిగట్టిన దొంగలు రైతు వచ్చేలోపు నాలుగు సంచులకు మిరప కాయలను నింపుకుని వెళ్లారు. దాదాపు ఒకటిన్నర క్వింటాకు పైగా మిరప కాయలను చోరీ చేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

గ్రామంలోని రామకృష్ణ పొలంలో ఆరబెట్టిన మిరపకాయలు ఎత్తుకెళ్లేందుకు బుధవారం రాత్రి నలుగురు దొంగలు వెళ్లారు. పొలంలో బురద ఉండటం, దగ్గర్లో ఉన్న రైతులు టార్చ్‌లైట్లు వేయటంతో పారిపోయారు.
కరకముక్కల దారి వైపు కాలువ మారయ్య పొలం వద్ద నలుగురు దొంగలు మిరపకాయలు కోసం వెళ్లారు. మిరపరాశుల వద్దకు వెళ్లిన దొంగలను భాగ్యమ్మ అనే మహిళా రైతు గమనించి కేకలు వేయటంతో చుట్టు పక్కల ఉన్న రైతులు అందరూ ఒక్కసారిగా అక్కడికి రావటంతో దొంగలు పరారయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సాక్షి మీడియా పై రూ.100 కోట్ల పరువు నష్టం వేసిన హెరిటేజ్..
Read Latest Telangana News and National News