33 మంది బాలురపై అత్యాచారం చేసిన దంపతులకు మరణశిక్ష
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:13 AM
మైనర్ బాలురపై అత్యాచారాలకు పాల్పడి, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ జంటకు ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: మైనర్ బాలురపై అత్యాచారాలకు పాల్పడి, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ జంటకు ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ఉన్న ప్రత్యేక కోర్టు శుక్రవారం మరణ శిక్ష విధించింది. నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీరుగా పనిచేసిన రామ్‌భావన్, అతడి భార్య దుర్గావతికి ఈ శిక్ష విధిస్తూ పిల్లలపై జరిగే నేరాలను విచారించే పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. 2010-2020 మధ్య పదేళ్ల కాలంలో పలు జిల్లాల్లో 33 మంది బాలురుపై అత్యాచారం చేసినట్టు రుజువయింది. బాధితుల్లో మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు.. దీనిని అత్యంత క్రూరమైన నేరంగా పరిగణించిన న్యాయస్థానం ‘అరుదైనవాటిలో అత్యంత అరుదైన కేసు’గా గుర్తించి మరణ శిక్ష విధించింది. బాఽధితులకు రూ.10 లక్షల వంతున పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.