వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,720గా ఉంది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రీమియం ఫర్నీచర్ బ్రాండ్ ఫాబియెన్స్.. రూ.50 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్ను ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించింది.
స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ ఒక దశలో 1,076 పాయిం ట్ల మేర ఎగబాకినప్పటికీ, చివరికి 879.09 పాయింట్ల (1.23 శాతం) లాభంతో 72,472.33 వద్దకు చేరింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ (జేఎఫ్ఎల్).. ఈ నెలలో ప్రారంభించనున్న తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లో షేర్లను రూ.1,065 -1,119 ధరల శ్రేణిలో ఆఫర్ చేయవచ్చని సమాచారం.
భారత ఐటీ కంపెనీలు అమెరికాపై అతిగా ఆధారపడడం ఇక ఏ మాత్రం మంచిది కాదని ప్రముఖ మేధో సంస్థ జీటీఆర్ఐ హెచ్చరించింది. అమెరికా తాజా ఆంక్షలు ఆ దేశంలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డుల జారీ కట్టడితోనే ఆగదని స్పష్టం చేసింది.
వియత్నాంకు చెంది న విద్యుత్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్.. భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది.
భారత్లో వంటనూనెల ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో దేశీయంగా నూనెగింజల దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అలాగే, ఆగ్నేయాసియాలో పామాయిల్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ పరిణామాలు 2027 నాటికి వంటనూనెల కొరతను తీవ్రతరం చేయవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
అమెరికా గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ స్పందించింది. ఈ నిర్ణయం తమ వ్యాపార కార్యకలాపాలు, క్లయింట్ సేవలపై ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది.
కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు భారత్లో ఒక్కసారిగా పెరిగాయి. మేలిమి బంగారం ధర అమాంతం రూ.1100ల మేర ఎగబాకింది.
పండుగ సీజన్లో గోల్డ్ కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా బంగారం ధరలు గత కొన్ని రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి.