Share News

Gold Rates on Nov 27: బంగారం ధరల్లో సూపర్ ర్యాలీ

ABN , Publish Date - Nov 27 , 2025 | 06:38 AM

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు, బలహీనపడ్డ డాలర్ వెరసి బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు రోజుల్లో భారీ స్థాయిలో పెరిగాయి. మరి దేశంలో నేడు గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Gold Rates on Nov 27: బంగారం ధరల్లో సూపర్ ర్యాలీ
Gold, Silver prices in India on Nov 27

ఇంటర్నెట్ డెస్క్‌: గత రెండు రోజుల వ్యవధిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సుమారు రూ.2700 మేర ఎగబాకాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లల్లో కోత తప్పదన్న అంచనాలతో ధరలకు రెక్కలొచ్చాయి. డాలర్ బలహీనపడటం కూడా ధరల పెరుగుదలకు దారితీసింది. గుడ్ రిటర్న్స్‌ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.30 గంటలకు భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,27,920కు చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,17,920కు ఎగబాకింది. వెండి ధరలు కూడా గత రెండు రోజుల్లో రూ.6 వేలకు పైగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.1,69,100కు చేరింది (Gold, Silver Rates on Nov 27).

అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు బలపడటం ఈ ర్యాలీకి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్‌లో జరిగే మీటింగ్‌లో వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్స్ మేర కోత పడే ఛాన్స్ ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలిచ్చారు. దీనికి తోడు డాలర్ కూడా బలహీనపడింది. డాలర్ సూచీ 100 మార్కు దిగువకు చేరింది. ఫలితంగా బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. అయితే, ఈ జోష్ స్వల్ప కాలికమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేరడంతో భౌగోళికరాజకీయ అనిశ్చితులు తొలగుతున్నాయి. దీంతో, సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మళ్లీ డిమాండ్ తగ్గి స్టాక్స్‌లోకి పెట్టుబడుల వరద పెరిగే ఛాన్స్ ఉంది.


ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ (24కే, 22కే, 18కే)

  • చెన్నై: ₹1,28,740; ₹1,18,010; ₹98,460

  • ముంబై: ₹1,27,920; ₹1,17,260; ₹95,940

  • న్యూఢిల్లీ: ₹1,28,070; ₹1,17,410; ₹96,090

  • కోల్‌కతా: ₹1,27,920; ₹1,17,260; ₹95,940

  • బెంగళూరు: ₹1,27,900; ₹1,17,240; ₹95,940

  • హైదరాబాద్: ₹1,27,920; ₹1,17,260; ₹95,940

  • విజయవాడ: ₹1,27,920; ₹1,17,260; ₹95,940

  • కేరళ: ₹1,27,910; ₹1,17,240; ₹95,930

  • పుణె: ₹1,27,920; ₹1,17,260; ₹95,940

  • వడోదరా: ₹1,27,970; ₹1,17,310; ₹95,990

  • అహ్మదాబాద్: ₹1,27,970; ₹1,17,310; ₹95,990

కిలో వెండి ధరలు ఇవీ

  • చెన్నై: ₹1,76,100

  • ముంబై: ₹1,69,100

  • న్యూఢిల్లీ: ₹1,69,100

  • కోల్‌కతా: ₹1,69,100

  • బెంగళూరు: ₹1,69,100

  • హైదరాబాద్: ₹1,76,100

  • విజయవాడ: ₹1,76,100

  • కేరళ: ₹1,76,100

  • పుణె: ₹1,69,100

  • వడోదరా: ₹1,69,100

  • అహ్మదాబాద్: ₹1,69,100


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలను మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

ఇవీ చదవండి:

షేర్‌ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నారా? అయితే..

Stock Market Sensex Surges: మార్కెట్లో ఫెడ్‌ జోష్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 27 , 2025 | 06:48 AM