Share News

SEBI Duplicate Share Certificates: షేర్‌ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నారా

ABN , Publish Date - Nov 27 , 2025 | 03:28 AM

షేర్లు, బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు వంటి సెక్యూరిటీల సర్టిఫికెట్లను పోగొట్టుకున్నారా..? వాటి డూప్లికేట్‌ కాపీలను ఇకపై సులభంగా, తక్కువ ఖర్చుతో పొందేలా నిబంధనలను సడలించాలని సెబీ భావిస్తోంది...

SEBI Duplicate Share Certificates: షేర్‌ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నారా

  • డూప్లికేట్‌ కాపీలు పొందడం ఇక ఈజీ

  • నిబంధనలను సడలించనున్న సెబీ

ముంబై: షేర్లు, బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు వంటి సెక్యూరిటీల సర్టిఫికెట్లను పోగొట్టుకున్నారా..? వాటి డూప్లికేట్‌ కాపీలను ఇకపై సులభంగా, తక్కువ ఖర్చుతో పొందేలా నిబంధనలను సడలించాలని సెబీ భావిస్తోంది. డూప్లికేట్‌ సెక్యూరిటీ సర్టిఫికెట్ల జారీకి ఒకే రకమైన ఫారాలను ప్రతిపాదించింది. అంతేకాదు, పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయడం, పత్రికల్లో ప్రకటన జారీ చేయాల్సిన అవసరం లేకుండా డూప్లికేట్‌ సర్టిఫికెట్ల జారీ చేయగలిగే పరిమితిని ప్రస్తుతమున్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కూడా సెబీ ప్రతిపాదించింది. అంతేకాదు, నకిలీ కాపీల కోసం దరఖాస్తు చేసే సమయంలో అఫిడవిట్‌తోపాటు ఇండెమ్నిటీ బాండ్‌ను కూడా జతచేసే అవసరానికి స్వస్తి పలికి అఫిడవిట్‌ కమ్‌ ఇండెమ్నిటీ బాండ్‌ను సమర్పిస్తే చాలని సెబీ అంటోంది. వీటిపై డిసెంబరు 16లోగా అభిప్రాయాలు తెలుపాల్సిందిగా ప్రజలను కోరింది.

ప్రస్తుత నిబంధనలు ఇలా..

సెబీ తాజా సర్క్యులర్‌ ప్రకారం.. ప్రస్తుతం డూప్లికేట్‌ సెక్యూరిటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మూడు దశల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఇందుకు మదుపరి ఎఫ్‌ఐఆర్‌/ పోలీస్‌ స్టేషన్‌లో సమర్పించిన ఫిర్యా దు కాపీ/ కోర్టు ఇంజక్షన్‌ ఆర్డరు/పోగొట్టుకున్న సెక్యూరిటీల వివరాలతో కూడిన ఫిర్యాదు కాపీని సమర్పించాల్సి ఉంటుం ది. అలాగే, పోయిన సెక్యూరిటీ సర్టిఫికెట్ల విషయమై ఏదైనా వార్తా పత్రిక ద్వారా ప్రకటన కూడా జారీ చేయాలి. ఆ తర్వాత మదుపరి అఫిడవిట్‌, ఇండెమ్నిటీ బాండ్‌ను విడివిడిగా సెబీ నిర్దేశిత ఫార్మాట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అయితే, దరఖాస్తు సమర్పించేనాటికి ఆ సర్టిఫికెట్ల విలువ రూ.5 లక్షలకు మించని పక్షంలో ఎఫ్‌ఐఆర్‌ సమర్పించడం, పత్రికలో ప్రకటన జారీ చేయాల్సిన అవసరం లేదు.


పెట్టుబడి సలహాదారులు, రీసెర్చ్‌ అనలిస్టులకు

విద్యార్హత నిబంధనల సడలింపు

పెట్టుబడి సలహాదారులు, రీసెర్చ్‌ అనలి్‌స్టలకు విద్యార్హత నిబంధనలను సెబీ సడలించింది. ఏ డిగ్రీ అభ్యర్థి అయినా రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది. అయినప్పటికీ, ఎన్‌ఐఎ్‌సఎం సర్టిఫికేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణులవడం మాత్రం తప్పనిసరని మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్లలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఫైనాన్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌, క్యాపిటల్‌ మార్కెట్లు వంటి ఆర్థిక సంబంధిత రంగాల్లో డిగ్రీ లేదా మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసినవారు మాత్రమే ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్లు లేదా రీసెర్చ్‌ అనలిస్ట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఇవీ చదవండి:

డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!

మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌‌మెంట్‌పై అవగాహన కల్పించండి!

Updated Date - Nov 27 , 2025 | 03:28 AM