Bank Holidays in December: డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:24 AM
లావాదేవీల చెల్లింపు నిమిత్తం నిత్యం బ్యాంకుకు వెళ్లేవారు డిసెంబర్ నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నెలలో మొత్తం 16 రోజులు సెలవులు, పైగా ఇయర్ ఎండింగ్ కాబట్టి.. కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతమున్న టెక్నాలజీతో బ్యాంకు పనులన్నీ దాదాపుగా స్మార్ట్ ఫోన్(Smart Phone)లోనే చక్కబెట్టేస్తున్నాం. అయితే.. కొన్ని ముఖ్యమైన పనుల నిమిత్తం కొందరు, నిత్యం లావాదేవీలు నిర్వహించేందుకు మరికొందరు.. తప్పకుండా బ్యాంకుకు వెళ్లాల్సిందే. అలాంటి వారు సెలవులపై కాస్తంత అవగాహన కలిగి ఉండటం మంచిది. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే చాలు.. సకాలంలో పనులు ముగిసిపోతాయి. ఇక డిసెంబర్ నెలలో ఎప్పుడు బ్యాంకుకు వెళ్లాలి, ఏయే రోజుల్లో సెలవులు(Bank Holidays in December) ఉంటున్నాయో ఓసారి పరిశీలిస్తే.. మొత్తం 31 రోజుల్లో దేశవ్యాప్తంగా 16 రోజులు సెలవు ఉంటుంది. ఆ వివరాలు మీకోసం...
డిసెంబర్ నెలలో బ్యాంకు సెలవుల వివరాలు:
డిసెంబర్ 01: స్వదేశీ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఆ రోజు బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 03: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగను పురస్కరించుకుని గోవాలో ఆ రోజు బ్యాంకులకు సెలవు ఉండనుంది
డిసెంబర్ 12: పా టోగన్ నెంగ్‌మింజా సంగ్మా వర్ధంతి సందర్భంగా మేఘాలయ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 13: రెండో శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 18: మేఘాలయలో 'గొప్ప సాహిత్య దిగ్గజం'గా భావించే యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 19: గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో సెలవు
డిసెంబర్ 20: సిక్కిం ప్రజలకు నూతన సంవత్సరం కాబట్టి ఆ రాష్ట్రంలో సెలవు ఉంటుంది
డిసెంబర్ 22: సిక్కింలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఆ రాష్ట్రంలో మరోసారి సెలవు ఉండనుంది
డిసెంబర్ 24: క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 25: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆ రోజున దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 27: క్రిస్మస్ వేడుకను పురస్కరించుకుని నాగాలాండ్‌లో; నాల్గవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉండనుంది
డిసెంబర్ 30: జైన్‌తీయ స్వాతంత్ర్య సమరయోధుడు కియాంగ్ నంగ్బా వర్ధంతి సందర్భంగా మేఘాలయలో సెలవు
డిసెంబర్ 7,14, 21, 28: ఆదివారం కావున దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం
ఇలా డిసెంబర్ నెలలో మొత్తం 16 రోజులు సెలవులు వచ్చినప్పటికీ.. ఆన్‌లైన్, మొబైల్ సేవలు యథాతథంగా అందుబాటులోనే ఉంటాయి. కానీ, ఆయా బ్యాంకుల్లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడం కోసం ఖాతాదారుడికి ముందస్తు సమాచారం అందజేసి ఆ సమస్యను పరిష్కరిస్తాయి.
ఇవీ చదవండి: