Arvind Pharma CFO: ఈ ఏడాది చివరికి బ్రేక్ ఈవెన్
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:27 AM
Arvind Pharma CFO on Break even for China Plant Penicillin G Pricing Concerns
చైనా ప్లాంటు నష్టాలపై
అరబిందో ఫార్మా సీఎఫ్‌ఓ
పెన్సిలిన్-జీకి కనీస దిగుమతి ధర ఉండాలి
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అరబిందో ఫార్మా చైనాలో ఏర్పాటు చేసిన ఓరల్ సాలిడ్ డోసేజి (ఓఎ్‌సడీ) ప్లాంటు ఇంకా నష్టాల్లోనే నడుస్తోం ది. ఈ త్రైమాసికంలో నష్టం 10 లక్షల డాలర్ల (సుమా రు రూ.8.9 కోట్లు) వరకు ఉంటుందని కంపెనీ సీఎ్‌ఫఓ ఎస్ సుబ్రమణియన్ తెలిపారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా చైనా ప్లాంటు లాభ-నష్టాలు లేని స్థితికి (బ్రేక్ ఈవెన్) చేరే అవకాశం ఉందన్నారు. కంపెనీ స్థూల లాభాలు పెంచడంలో ముందు ముందు చైనా ప్లాంటు పాత్ర కూడా ఉంటుందన్నారు. విశ్లేషకుల ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
చైనా ప్లాంటు ప్రత్యేకతలు: చైనాలో ఈ ప్లాంటు ఏర్పాటు కోసం అరబిందో ఫార్మా 14.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,290 కోట్లు) ఖర్చు చేసింది. ఏటా 200 కోట్ల డోసుల సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ గత ఏడాది నవంబరులో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంటు లో తయారుచేసే 10 ఉత్పత్తులకు యూరోపియన్ యూనియన్, మూడు ఉత్పత్తులకు చైనా ఔషధ నియంత్రణ సంస్థల ఆమోదం ఉంది. దీంతో ముందు ముందు ఈ ప్లాంటు తమ లాభాల వృద్ధికి చెప్పుకోదగ్గ స్థాయిలో సహకరిస్తుందని అరబిందో ఫార్మా భావిస్తోంది.
దేశీయ వ్యాపారం: దేశీయ వ్యాపారం పైనా అరబిందో ఫార్మా సుబ్రమణియన్ మాట్లాడారు. ఏటా 15,000 టన్ను ల పెన్సిలిన్-జీ ఉత్పత్తి సామర్ధ్యంతో కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటులో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 1,050 టన్నుల పెన్సిలిన్ జీ ఉత్పత్తి చేసినట్టు సుబ్రమణియన్ చెప్పారు. ఇది ప్లాంటు మొత్తం ఉత్పత్తి సామర్ధ్యంలో 40 నుంచి 50 శాతం మాత్రమే. ప్రభుత్వం ఈ ఉత్పత్తికి కనీస దిగుమతి ధర (ఎంఐపీ) నిర్ణయిస్తే తప్ప, పూర్తి ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ ప్లాంటు పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దేశంలో పెన్సిలిన్ జీ ఉత్పత్తి చేసే అనేక కంపెనీలు ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అమెరికా, ఈయూ బేష్: అమెరికా, ఈయూ దేశాలు అరబిందోఫార్మాకు కీలక మార్కెట్లని సుబ్రమణియన్ చెప్పారు. ఈయూ దేశాలు వ్యూహాత్మకంగా మరింత కీలకమన్నారు. అక్కడ తమ ఆదాయ వృద్ధి అద్భుతంగా ఉందన్నారు. అమెరికాలోని డేటన్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటులో నూ వాణిజ్య స్థాయి ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. వచ్చే జనవరి నుంచి ఈ ప్లాంటు ఉత్పత్తులు మార్కెట్‌లో విడుదలవుతాయన్నారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్లాంటు కంపెనీ ఆదాయ వృద్ధికి గణనీయంగా తోడ్పడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. వచ్చే రెండేళ్లలో పెన్సిలిన్ జీ ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ, బయోసిమిలర్స్, బయోలాజిక్ సీఎంఓ కార్యకలాపాలు కంపెనీ ఆదాయాలు, లాభాల వృద్ధికి పెద్ద ఊతం కానున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 20--21 శాతం మార్జిన్ల లక్ష్యాన్ని అందుకోగలమని సుబ్రమణియన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి