Ace International Dairy Plant: కుప్పంలో రూ 305 కోట్లతో డెయిరీ ప్లాంట్
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:10 AM
ప్రముఖ పాడి ఉత్పత్తుల సంస్థ ఏస్ ఇంటర్నేషనల్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 3.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.305 కోట్లు) పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లోని...
ఏస్ ఇంటర్నేషనల్
హైరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): ప్రముఖ పాడి ఉత్పత్తుల సంస్థ ఏస్ ఇంటర్నేషనల్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 3.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.305 కోట్లు) పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం వద్ద ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తోంది. కంపెనీ ఈ నిధులను నెదర్లాండ్ కేంద్రంగా పనిచేసే కొన్ని ఆర్థిక సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల నుంచి సమీకరించింది. కుప్పం వద్ద ఏర్పాటు చేసే ప్లాంటులో పెద్దలు, చిన్న పిల్లల ఆరోగ్యం, పోషణకు దోహదం చేసే పాడి ఉత్పత్తులు, ఇతర ఆహార ఉత్పత్తులు తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఏస్ ఇంటర్నేషనల్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో రోజుకు ఐదు లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్ధ్యం ఉన్న డెయిరీ ప్లాంటును నిర్వహిస్తోంది. ఈ ప్లాంటులో తయారయ్యే ఉత్పత్తులను కంపెనీ దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తోంది. కుప్పం ప్లాంటులో ఉత్పత్తి చేసే పాల ఉత్పత్తులనూ విదేశాలకు ఎగుమతి చేయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News