Secret Foreign Assets: ఐటీ చేతిలో బడా బాబుల విదేశీ రహస్య ఆస్తుల చిట్టా
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:14 AM
విదేశాల్లో రహస్యంగా కూడబెట్టిన బడా బాబుల గుట్టు రట్టవుతోంది. సప్త సముద్రాల ఆవల కూడబెట్టిన ఈ ఆస్తుల వివరాలను సైతం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ వెలికి తీస్తోంది. స్విట్జర్లాండ్‌తో సహా...
త్వరలో 24,678 మందికి ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎ్‌సలు
న్యూఢిల్లీ: విదేశాల్లో రహస్యంగా కూడబెట్టిన బడా బాబుల గుట్టు రట్టవుతోంది. సప్త సముద్రాల ఆవల కూడబెట్టిన ఈ ఆస్తుల వివరాలను సైతం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ వెలికి తీస్తోంది. స్విట్జర్లాండ్‌తో సహా పలు దేశాలతో కుదిరిన పరస్పర సమాచార మార్పిడి (ఏఈఓఐ) ఒప్పందం ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇలా విదేశాల నుంచి అందిన సమాచారాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫైల్ చేసిన ఐటీ రిటర్న్‌లను పోల్చి చూసి విదేశాల్లోని తమ ఆస్తుల వివరాలు వెల్లడించని 24,678 మంది బడా బాబుల జాబితాను ఐటీ శాఖ సిద్ధం చేసింది. విదేశాల్లో వీరు కూడబెట్టిన ఆస్తుల విలువ ఎంత లేదన్నా రూ.29,208 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ఆస్తులకు తోడు వీరు తమ ఐటీ రిటర్న్‌ల్లో వెల్లడించని విదేశీ ఆదాయం రూ.1,089.88 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
డిసెంబరు వరకే గడువు: ఈ ఏడాది చివరికల్లా ఈ రహస్య ఆస్తుల వివరాలతో సవరించిన ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేస్తారా? లేక కొరడా ఝళిపించమంటారా? అని ఐటీ శాఖ త్వరలో వీరికి ఎస్‌ఎంఎ్‌సలు, ఈమెయిల్స్ పంపనుంది. అప్పటికే వినకపోతే 30 శాతం పన్నుతో పాటు ఆ చెల్లించాల్సిన పన్నుపై రూ.10 లక్షల జరిమానా తప్పదని ఐటీ అధికారులు హెచ్చరించనున్నారు. విదేశాల్లో ఇలా రహస్యంగా ఆస్తులు కూడబెట్టిన వారిలో ప్రముఖ కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News